వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయందోళనలకు గురి చేస్తున్నాయి. అయితే తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
గత కొన్ని రోజుల నుంచి వరుస గుండెపోటుతో జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా వస్తున్న ఈ గుండెపోటుతో రోజుకు ఎంతోమంది చనిపోతున్నారు. ఈ వరుస గుండెపోటుతో జనాలు మృత్యువాతపడుతుండడంతో ప్రజలు భయందోళనలకు గురవుతున్నారు. అయితే తాజాగా తెలంగాణలో మరో వ్యక్తి హార్ట్ ఎటాక్ తో మరణించాడు. శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్తుండగా అతడికి సడెన్ గా గుండెపోటు రావడంతో క్షణాల్లో అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డ్ అయింది.
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షుడు రాజ్ ఠాకూర్ సోదరుడు శైలేందర్ సింగ్ గోదావరిఖనిలో నివాసం ఉంటున్నాడు. అయితే శుక్రవారం శైలేందర్ సింగ్ ఏదో పని మీద బయటకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాడు. అయితే ఈ క్రమంలోనే సడెన్ గా అతనికి గుండెలో నొప్పిగా అనిపించింది. దీంతో అక్కడే ఉన్న గొడను పట్టుకుని నిలబడదామని అనుకున్నాడు. కానీ, అంతలోనే ఉన్నట్టుండి శైలేందర్ సింగ్ గుండెపోటుతో కుప్పకూలాడు. వెంటనే గమనించిన అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు ఇతను అప్పటికే గుండెపోటుతో మరణించాడని నిర్ధారించారు. శైలేందర్ సింగ్ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే అతడు గుండెపోటుతో కుప్పకూలి కిందపడిపోతున్న దృశ్యాలు వారి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన జనాలు ఏంటీ వరుస గుండెపోటు మరణాలు అంటూ భయందోళనలకు గురవుతున్నారు. వరుస గుండెపోటు మరణాలపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 4, 2023