love affair : అవును వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వివాహబంధంతో ఒక్కటై.. కలకాలం కలిసుండాలని కలలు కన్నారు. కానీ అంతలోనే వేరోకరితో పెళ్లికి ఒప్పుకుంది ఆ యువతి. విషయం తెలుసుకున్న ఆ యువకుడు.. స్నేహితులు, బంధువులు నడుమ వివాహ వేడుక జరుగుతున్న వేదిక దగ్గరకు వచ్చాడు. వారి మధ్యనున్న ప్రేమ బంధం గురించి ఆ యువకుడు అందరి ముందు గట్టిగా అరుస్తూ చెబుతున్నాడు. ఇంతలో పెళ్లి పీటలపై ఉన్న వధువు.. అతనికి మైండ్ బ్లాక్ అయ్యే షాక్ ఇచ్చింది… వివరాల్లోకి వెళితే.. బీహార్‌కు చెందిన యువతి యువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఎంతో అన్యోన్యంగా గడపాలని వారిద్దరూ ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ యువతి కాజల్ కు వేరే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది.
తనను కాదని వేరొకరితే పెళ్లి ఎలా ఒప్పుకుంటుందని ఆ యువకుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇక తన ప్రేయసి పెళ్లి జరుగుతున్న మండపానికి వెళ్లాడు. అక్కడ బంధువులు, సన్నిహితుల నడుమ ఆ యువతి వివాహం జరుగుతోంది. ఆమె మెడలో మూడు ముళ్లు పడతాయనగా వచ్చిన ఆమె మాజీ ప్రియుడు అక్కడకు చేరుకుని పెళ్లిని ఆపాడు. ఇక సినిమా రేంజ్ లో మనోడు డైలాగులు అందుకున్నాడు. కాజల్ అని బిగ్గరగా అరుస్తు.. మాజీ ప్రియుడు పెళ్లి వేదిక దగ్గరకు చేరుకున్నాడు. నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. సమాజం గురించి పట్టించుకోకు. నేను నిన్ను మనసారా ప్రేమిస్తున్నాను. నువ్వు నిజం చెప్పు.
నన్ను ప్రేమిస్తున్నావా.. లేదా అని అడిగాడు.. అప్పుడు ఆమె అతనికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆ యువకుడి మాటలకు కౌంటర్‌గా.. అసలు నువ్వేవరో కూడా నాకు తెలియదు.. ఇక ప్రేమ ఎలా ఉంటుంది. ఎంతో పవిత్రమైన ఆ పదానికి అసలు అర్థం తెలుసా అంటూ ఆగ్రహంతో.. కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేసింది. దీంతో అతను షాక్ కు గురయ్యాడు. అంతటితో ఆగకుండా ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్లి పోవాలంటూ ఆ యువకుడ్ని గట్టిగా హెచ్చరించింది. దీంతో ఒక్కసారిగా అక్కడ నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఆరేళ్ల పిల్లాడు చేసిన పనికి షాకైన పోలీసులు!