మనం ఓ ఐస్ ముక్క తీసుకుని చేతి మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది? పట్టుమని 10సెకెన్లు కూడా ఉండలేం కదా. కానీ ఓ వ్యక్తి ఏకంగా మూడు గంటల పాటు ఐసు ముక్కలు ఉన్న పెట్టెలో కూర్చున్నాడు. అది కూడా మాములుగా కాదండోయి.. బట్టలు లేకుండా. ఇంతకి ఆయన బిగ్ టాస్క్ చేయాల్సి వచ్చింది అనేదే కదా మీ సందేహం. మరి అతను ఎందుకు అలా చేశాడంటే ఇది చదవాల్సిందే..
గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్.. చాలా మందికి ఇందులో పేరు నమోదు చేసుకోవాలని అనేది కల. ఏదో ఒకటి చేసి రికార్డ్ సృష్టించాలి అనుకుంటారు. అందులో చాలా మంది చేసే పనులు దిమ్మతిరిగేలా ఉంటాయి. అలానే పోలాండ్‌కు చెందిన వాలెర్జాన్ రొమానోవ్స్కీ కోరుకున్నాడు. అందుకోసం ఓ గ్లాస్ బాక్స్‌లో అతను బట్టలు లేకుండా నిల్చున్నాడు. దాన్ని మొత్తం ఐస్ క్యూబ్స్‌తో నింపేశారు. అలా మెడ వరకు ఉన్న ఐస్ బాక్స్‌లో 3గంటల ఒక్క నిమిషం ఉన్నాడు. ఈ ఫీట్‌కి సంబంధించిన వీడియోని గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎముకలు కొరికేసే ఐసులో పోలాండ్ వాసి వాలెర్జాన్ రొమానోవ్స్కీ అని క్యాప్షన్ కూడా ఇచ్చారు.
వాలెర్జాన్ కి ఇది ఎలా సాధ్యమైందనే అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతోంది. ఈ రికార్డు కోసం అతను ఆరు నెలల పాటూ ట్రైనింగ్ తీసుకున్నాడు. వాలెర్జాన్ ఇదివరకు కూడా కొన్ని రికార్డులు సాధించాడు. వాటన్నింటినీ కాన్సర్ పేషెంట్లకు అంకితమిచ్చాడు. తాజా రికార్డును కూడా వారికే అంకితం చేశాడు. మరి.. ఈ ఐస్ మ్యాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.