జనాలు ఎండాకాలంలో శీతల పానియాలు, శీతల పదార్థాలు తీసుకోవడానికి ఎక్కువగా మొగ్గుచూపుతుంటారు. మండుటెండల్లో ఐస్ క్రీం వంటి పదార్థాలు ఎక్కువగా అమ్ముడవుతుంటాయి. సుర్రుమనిపించే వేసవిలో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఐస్ క్రీం లను ఇష్టంగా తింటుంటారు. తక్కువ ధరల్లో లభిస్తాయి కాబట్టి ఐస్ క్రీంలను కొనడానికి వెనకాడరు. కానీ ఇప్పుడు చెప్పబోయో ఐస్ క్రీం ధర వింటే కళ్లు తేలేస్తారు.

సాధారణంగా ఐస్ క్రీం ధరలు పది రూపాయల నుంచి మొదలుకొని ఆయా కంపెనీల బ్రాండ్ ధరల ప్రకారం ఓ ఐదువందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉంటది కావొచ్చు. కానీ ఓ కంపెనీ తయారు చేసిన ఐస్ క్రీం ధర రూ. 5.2 లక్షలు. ఇది వినడానికి ఆశ్యర్యంగా ఉన్నప్పటికి ఇది నిజమే. స్వతాగ ఆ కంపెనీయే ఈ ధరను వెల్లడించింది. జపాన్ కు చెందిన ఒ కపంపెనీ తయారు చేసిన ఐస్ క్రీం ప్రపంచంలోనే అత్యధిక ఖరీదైనదిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఐస్ క్రీం తయారీలో పేరుగాంచిన ప్రముఖ ఐస్ క్రీం బ్రాండ్ కంపెనీ సెలాటో ఈ ఐస్ క్రీం ను తయారు చేసింది. దీని ధర 8,73,400 జపాన్ యెన్ లుగా నిర్ణయించింది. ఈ ధర ఇండియన్ కరెన్సీలో రూ. 5.2 లక్షలు.
ప్రత్యేకంగా ఈ ఐస్‌క్రీమ్ తయారీలో వాడిన వైట్ ట్రఫుల్ అనే అరుదైన పదార్థాన్ని ఇటలీలోని ఆల్బా నుంచి తెప్పించినట్లు సెలాటో సంస్థ వెల్లడించింది. ఈ ట్రఫుల్ ధర కిలోకు రెండు మిలియన్ జపనీస్ యెన్‌లు (సుమారు రూ.11.9 లక్షలు) ఉంటుందని తెలిపింది. ఈ ట్రఫుల్ సువాసన చాలా ప్రత్యేకంగా ఉంటుందని పేర్కొంది. ఈ కారణం చేతనే ఈ ఐస్‌క్రీమ్‌కి అంత ధర ఉందని స్పష్టం చేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్‌గా ఇది గిన్నిస్ రికార్డుల్లో చోటు సంపాదించింది. అత్యంత ఖరీదైన ఈ ఐస్‌క్రీమ్‌కు సంబంధించిన వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డు తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది. ఇది చూసిన నెటిజన్లు ఇంత ఖరీదైన ఐస్ క్రీం తినాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందేనని స్పందిస్తున్నారు.
New record: Most expensive ice cream – JP¥873,400 (£5,469; €6,211; $6,696) made by OMER in Japan.
The ice cream includes edible gold leaf, white truffle and natural cheeses 🍨 pic.twitter.com/kaJOACEear
— Guinness World Records (@GWR) May 18, 2023