ఓ మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం తన ఆరేళ్ల కూతురితో కలిసి పోలండ్ నుండి భారత్‌లోని ఝార్ఖండ్‌కు వచ్చేసింది. వారు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఆ తర్వాత..
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలోనే ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారు. పక్కనున్న మనిషితో ఎలా వ్యవహరించాలో తెలియదు కానీ ఫేస్‌బుక్‌లో.. ఇన్‌స్టాలో పరిచయం కాగానే తర్వాత జరిగే పర్యవసానం ఆలోచించకుండా పరిచయమైన వ్యక్తి కోసం వెళ్లిపోతున్నారు. సెల్‌ఫోన్ మన కొంపలను ముంచుతోంది. మొన్న పబ్జీ ఆటతో మొదలైన ప్రేమతో ఖండాంతరాలు దాటి ప్రియుడ్ని కలిసేలా చేసింది. ఓ యువతి బంగ్లాదేశ్ నుండి భారత్ కు వచ్చింది. ఇదే తరహాలో సీమ అనే మరో యువతి పాకిస్తాన్ నుండి ఉత్తరప్రదేశ్ లో తన ప్రియుడి కోసం నలుగురి పిల్లలను తీసుకుని శాశ్వతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా ఓ పోలండ్ వనిత ఇన్‌స్టాలో పరిచయమైన ప్రియుడి కోసం తన ఆరేళ్ల కూతురితో ఇండియాకు వచ్చేసింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం..
ఓ మహిళ ప్రేమించిన వ్యక్తి కోసం తన ఆరేళ్ల కూతురితో కలిసి పోలండ్ నుండి భారత్‌లోని ఝార్ఖండ్‌కు వచ్చేసింది. పోలాక్ బార్బరా అనే 45 సంవత్సరాల యువతికి మహ్మద్ షాదాబ్ అనే 35 సంవత్సరాల యువకుడు ఇన్‌స్టాగ్రాం ద్వారా పరిచయం అయ్యాడు. మహ్మద్ షాదాబ్ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లా ఖుత్రా గ్రామానికి చెందినవాడు. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. పోలాక్‌కు ముందే పెళ్లై ఆరేళ్ల కుమార్తె ఉంది. అయితే ఆమె తన భర్తతో విడాకులు పొందింది. కొద్దిరోజుల క్రితం పోలండ్ నుండి వచ్చిన పోలాక్ హజరీబాగ్‌లో షాదాబ్‌తోనే ఉంటోంది. తనకోసం వచ్చిన వ్యక్తిని షాదాబ్ చాలా ప్రేమతో చూసుకుంటున్నాడు. పోలాక్ ఝార్ఖ్ండ్ లోని హీట్ తట్టుకోలేకపోవడంతో షాదాబ్ ఏసీ పెట్టించాడు.
పోలాక్ మాట్లాడుతూ.. ‘భారత్ చాలా అందమైన దేశం.. ఇక్కడి ప్రజలు ప్రేమ గలవారు. తనను బాగా చూసేందుకు రోజూ వందలాది మంది వస్తున్నారు’ అని చెప్పింది. ఈ విషయం పోలీసుల దాకా వెళ్లడంతో హజరీబాగ్ డీఎస్పీ ఆ గ్రామానికి వెళ్లి అసలు విషయాలను ఆరా తీశారు. పోలాక్‌తో మాట్లాడానని.. కొద్ది రోజుల్లో పోలండ్ వెళ్లిపోతానని చెప్పిందని అన్నారు. షాదాబ్‌కు వీసా వచ్చాక అతడిని పోలండ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.