king cobra : మనుషుల్ని మనుషులు చంపుకు తినటం ఎలా అత్యంత అరుదుగా జరుగుతుందో.. జంతువుల్ని జంతువులు చంపుకు తినటం కూడా అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. స్వ జాతి జీవుల్ని చంపుకు తినటాన్ని ‘‘కన్నిబలిజం’’ అంటారు. పాముల్లో కన్నిబలిజానికి సంబంధించిన వీడియోలు అరుదుగా కనిపించినా చూసే వారిని అబ్బురపరుస్తూ ఉంటాయి. తాజాగా, ఓ కోడె నాగుపాము, నాగు పామును తిన్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ తినటంలో చాలా ప్రత్యేకత ఉంది. పెద్ద నాగు పాము చిన్న నాగుపామును నోటితో పట్టుకుని గిరగిరా తిప్పి మరీ మింగేసింది. మొదట కలుగులో దాక్కున్న చిన్న నాగు పామును నోటితో పట్టుకుంది.
తర్వాత దాన్ని గిరగిరా తిప్పింది. మెల్లగా బయటకు తీసి మరోసారి తిప్పింది. చిన్న నాగుపాము గిలగిల్లాడుతున్నా వదల్లేదు. అది ప్రాణాలతో ఉండగానే మింగేసింది. తర్వాత బ్రేవ్… అని త్రేపుతున్నట్లు నోరు పెట్టింది. దీన్ని ఎప్పుడు, ఎక్కడ తీశారన్నది తెలియరాలేదు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘ వీడియో.. ఒళ్లు జలదరించేలా ఉంది’’.. ‘‘ కింగ్ కోబ్రా యాక్షన్‌లో ఉన్నపుడు చూడటం చాలా బాగుంది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఇల్లు అమావాస్య రోజు అద్భుతం.. వినాయకుడి గుడిలో అంతుచిక్కని రహస్యం..