పిల్లలు.. వీళ్లు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. ఏళ్లు వచ్చాక వాళ్ల మాటలు ఎలా ఉన్నా పెద్దగా మన అటెన్షన్ ని క్యాచ్ చేయదు. కానీ, చిన్నగా ఉన్నప్పుడు, అప్పుడప్పుడే మాటలు వస్తున్నప్పుడు అయితే వాళ్లు ఏం మాట్లాడినా తెగ నవ్వుకుంటాం. అయితే నవ్వుకోవడం సంగతి పక్కన పెడితే మీరు చిన్నగా ఉన్నప్పుడు ఏం నేర్పుతారో పెద్దయ్యాక కూడా అదే మాట్లాడతాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ల మనసులో నాటుకున్న విషయాలు పెద్దయ్యాక మరింత ప్రభావం చూపిస్తాయి. మీరు మంచి మాటలు నేర్పితే అదే మంచి వారి బిహేవియర్ లో కనిపిస్తుంది. మీరు సరదాకి అయినా తప్పుగా నేర్పితే అదే తప్పు కనిపిస్తుంది.
అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే.. ఓ బుడ్డోడి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బుడ్డోడు అంత గొప్ప పని ఏం చేశాడు అనుకుంటున్నారా? చేశాడు లెండి.. వాళ్ల ఇంట్లో వాళ్లు ఫోన్ మాట్లాడుతున్న సమయంలో పిల్లాడు ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. సదరు యువతి ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ప్రశ్నించగా.. నేను మగాడిని అంటూ సమాధానం చెప్పాడు. ఏం మాట్లాడుతున్నావ్ అసలు అర్థమవుతోందా అంటే.. నేను మగాడిని అంటూ కేకలు వేశాడు. తీరా చూస్తే వయసు ఎంత అంటే.. నిండా మూడేళ్లు కూడా ఉండేలా లేవు. కానీ, నేను మగాడ్ని అంటూ వేసే కేకలు చూస్తే అంతా ఆశ్చర్యపోతున్నారు. అసలు ఆ మాట ఎవరు నేర్పించి ఉంటారు అంటూ డౌటనుమానాలు వ్యక్త పరుస్తున్నారు.
అయితే ఈ వీడియో చూసిన తర్వాత అంతా నవ్వుకోవచ్చు. కానీ, తెలుసుకోవాల్సింది ఏంటంటే.. పిల్లలు పెద్దవాళ్లను చూసే మాట్లాడటం, తినడం, వస్త్రధారణ, ప్రవర్తనను నేర్చుకుంటారు. మీరు ప్రత్యేకంగా వారిని కూర్చోబెట్టి ట్యూషన్లు చెప్పాల్సిన పనిలేదు. మీ డైలీ లైఫ్ చేసే ప్రతి పని, ప్రతి మాటని వాళ్లు గమనిస్తూ ఉంటారు. అదే వాళ్లు మళ్లీ రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. నిజానికి ఆ బుడ్డోడి తప్పేముంది? ఇంట్లో పెద్దవాళ్లు అలాంటి మాటలు మాట్లాడి ఉంటారు. అది చూసి నేర్చుసుకున్నాడు. మళ్లీ ఏదో సందర్భంలో అవే మాటలను తిరిగి ఉపయోగించాడు. మొదట అలాంటి ప్రవర్తన ముద్దుగా అనిపించినా.. పెరిగే కొద్దీ చాలా ప్రమాదకరంగా మారచ్చు. నెటిజన్స్ కొందరు ఇదే విషయాన్ని కామెంట్ చేస్తున్నారు. పిల్లల ముందు ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. అది వాళ్ల భవిష్యత్‌ని నిర్ణయిస్తుంది.
Orey 😂🤣🙏pic.twitter.com/5O5EJhM2z6
— PK Cults 🔥 (@PKCults_) October 21, 2022