జబర్దస్త్ పేరు వినపడగానే గుర్తొచ్చే పేర్లలో ‘హైపర్ ఆది’ తప్పకుండా ఉంటుంది. తన నాన్‌స్టాప్ పంచులతో స్కిట్ మొదలైనప్పటి నుంచి ముగింపు వరకు గ్యాప్ లేకుండా నవ్విస్తుంటాడు. తన కామెడీ టైమింగ్, పంచ్‌లతో సినిమాల్లోనూ బాగానే పాపులర్ అయ్యాడు. ఇక, ఎన్నో షోలకు కూడా యాంకర్‌గా, మెంటర్‌గా చాలా బిజీ అయిపోయాడు ఆది. తాజాగా ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ప్రోగ్రామ్ వారు గురు పూజోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసిన ‘ఆచార్యదేవోభవ’ ప్రోమోలో ‘హైపర్ ఆది’ తనను బుల్లితెరకు పరిచయం చేసిన ‘అదిరే అభి’కి పాదాభివందనం చేశాడు. పొగడ్తలతో ముంచెత్తాడు.
అదిరే అభి గురించి మాట్లాడుతూ ‘ నా గురువు అభి అన్న గురించి చెప్పాలంటే ఆయన నాకు దేవుడితో సమానం’ ఇంతకన్నా ఏం చెప్పగలను అంటూ భావోద్వేగంతో వెళ్లి అభి కాళ్లు పట్టుకున్నాడు. ఎక్కడో యూట్యూబ్‌లో ఇమిటేషన్ స్కిట్లు చేసుకునే ఆది ట్యాలెంట్ గుర్తించి అతడ్ని జబర్దస్త్‌కి పరియచం చేశాడు అభి. ఒక్క ఆదినే కాదు ఇంకా ఎంతో మందిని బుల్లితెరకు పరిచయం చేయడంలో అభి కృషి ఉంది. డాన్స్, యాంకరింగ్, కామెడి, నటన అంశం ఏదైనా తనదైన శైలిలో ఆకట్టుకుంటాడు అదిరే అభి.
ప్రస్తుతం ప్రోమోలో మోగాస్టార్ చిరంజీవి ‘ఇంద్ర’ సినిమా నుంచి ఫేమస్ సాంగ్ దాయిదాయి దామ్మా సాంగ్‌కు యాంకర్ విష్ణుప్రియతో కలిసి వీణ స్టెప్పు వేసి అందరినీ ఆకట్టుకున్నాడు. తన శిష్యుడు రాము కొరియోగ్రఫీ చేసిన పాటకు అభి స్టెప్పులేయడం ఈ ప్రోమోలో మరో విశేషం. ప్రస్తుతం యూట్యూబ్‌లో తెగ వైరలవుతున్న ‘శ్రీదేవీ డ్రామా కంపెనీ’ ప్రోమో మీరూ చూసేయండి మరి.