ఉప్పల్ బాలు.. టిక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. తన టిక్ టాక్ వీడియోలతో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచకున్నాడు. ఇటీవల తెలుగు బుల్లితెరపై కూడా ఉప్పల్ బాలు కనిపించి సందండి చేస్తున్నాడు. ఈక్రమంలోనే జబర్దస్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోల్లో కూడా నటించాడు. అక్కడ కూడా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా జబర్ధస్త్ ఆర్టిస్ట్ లపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉప్పల్ బాలు.. తనకు సంబంధించి అనేక విషయాలు షేర్ చేసుకున్నాడు.
ఉప్పల్ బాలు మాట్లాడుతూ..”జబర్దస్త్ లో శాంతి స్వరూప్ , తన్మయ్, బుల్లెట్ భాస్కర్, అప్పారావులు.. నాకు దేవళ్లు. నాకు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. నాతో పద్ధతిగా మాట్లాడుతారు. ఇలా కాదు అలా ఉండాలి బాలు అంటూ మంచి సలహాలు ఇచ్చేవారు. కానీ ఓ ముగ్గురికి బలుపు ఉంది. టైమ్ వచ్చినప్పుడు వారి పేర్లు చెప్తాను. నన్ను స్టేజి మీద నుంచి కిందకి దించి అవమానించారు. వారి పేర్లు సమయం వచ్చినప్పుడు చెప్తాను” అంటూ ఉప్పల్ బాలు.. తన ఆవేదను వ్యక్తం చేశాడు. మల్లెమాలలో ఫుడ్ బాగుంటుందని, టైమ్ కి పేమెంట్ ఇస్తారని బాలు తెలిపాడు. ఉప్పల్ బాలు చెప్పిన మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఈ క్రింది వీడియోను వీక్షించండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.