స్కూల్‌కి వెళ్లే విద్యార్థులు అంటే ఎంత క్రమశిక్షణగా ఉండాలి. ఓ 10-15 ఏళ్ల క్రితం వరకు విద్యార్థులు అంటే.. ఎంతో పద్దతిగా, భయభక్తులు కలిగి ఉండేవారు. వారి దృష్టి చదువు, మార్కులు, టీచర్ల దగ్గర మంచి పేరు తెచ్చుకోవడం వంటి వాటి మీదే ఉండేది. ఆఖరికి ఇంట్లో తల్లిదండ్రులకు భయపడని పిల్లలు సైతం.. స్కూల్లో టీచర్లకు జడిసేవారు. అయితే కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతున్నాయి. ఇప్పటి పిల్లలు టీచర్లనగానే ఒణికిపోవడం లేదు. దానికి తోడు తల్లిదండ్రులు కూడా పిల్లలను కొట్టకూడదని చెప్పడంతో.. ఉపాధ్యాయులు కూడా మాకేందుకు వచ్చిన తలనొప్పి.. వచ్చామా.. పాఠాలు చెప్పామా.. వెళ్లమా అన్నట్లు ఉంటున్నారు. ఇక కరోనా కారణంగా ప్రస్తుతం స్కూల్‌కి వెళ్లే విద్యార్థులందరి చేతిలో మొబైల్ ఫోన్ తప్పనిసరి అయ్యింది. వీరిలో ఆన్‌లైన్ క్లాస్‌లు విని బాగుపడేవారు ఎందరో ఉంటున్నారో తెలియదు కానీ.. తప్పుడు మార్గంలో వెళ్లేవారు పెరిగిపోతున్నారు.
ప్రస్తుతం తల్లిదండ్రులను భయపెడుతున్న మరో భయం.. ప్రేమ వ్యవహారాలు. అవును పాఠశాల వయసులోనే ఆకర్షణ, వ్యామోహాల వలలో చిక్కుకుని.. అందమైన భవిష్యత్తును పాడుచేసుకుంటున్న విద్యార్థులు ఎందరో ఉంటున్నారు. ఈ లవ్ ట్రాక్‌ల కారణంగా రోడ్డు మీదకు వచ్చి తన్నుకుంటున్న విద్యార్థులను కూడా చూస్తున్నాం. ప్రసుత్తం ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి బెంగళూరులో చోటు చేసుకుంది. స్కూల్ విద్యార్థినిలు కొందరు రెండు వర్గాలుగా విడిపోయి.. నడి రోడ్డు మీద జుట్టు పట్టుకుని కొట్టుకున్నారు. ప్రస్తుతం వీరి గొడవకు సంబంధించిన వీడియో వైరలవుతోంది. ఇక వీరు ఇంతలా తన్నుకోవడానికి కారణం ప్రేమ వ్యవహారం.
ఇది కూడా చదవండి: Belly Dance : సంతాప సభలో ఐటెం సాంగ్‌కు బెల్లి డ్యాన్స్‌లు.. ఇదేం దరిద్రం రా నాయన!
సోషల్ మీడియాలో లభిస్తున్న సమాచారం ప్రకారం.. రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న ఈ అమ్మాయిల్లో ఓ గ్రూప్‌కు చెందిన అమ్మాయి.. మరో గ్రూప్‌కి చెందిన అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కి వెళ్లింది. అది కాస్త.. ఆ అబ్బాయి ఒరిజనల్ గర్ల్‌ఫ్రెండ్‌కి తెలిసింది. ఇంకేముంది.. ఆ విద్యార్థిని మరి కొందరు స్నేహితులను తీసుకుని.. గొడవకు వెళ్లింది. ఈ క్రమంలో విద్యార్థినులు రెండు వర్గాలుగా విడిపోయి దాడి చేసుకున్నారు.. కొందరు కర్రలతో కొట్టుకున్నారు. ఆడ పిల్లలు.. జుట్లు పట్టుకొని మరీ నడిరోడ్డుపై వీరంగం సృష్టించారు. అడ్డుకొనేందుకు వెళ్లినవారిసైతం పక్కకు తోసి మరీ తన్నుకున్నారు. ఈ ఘర్షణ సమయంలో కొంత మంది స్కూల్ యూనిఫాంలో ఉండగా, మరికొందరు క్యాజువల్స్ డ్రస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బేస్ బాల్ బ్యాట్ తీసుకొని మరో వర్గంలోని వ్యక్తులపై దాడి చేయడం వీడియోలో కనిపించింది. ఈ గొడవను నివారించేందుకు పక్కనే ఉన్న అబ్బాయిలు ప్రయత్నం చేశారు. అయినా ఆగకుండా స్ట్రీట్ ఫైట్ ను కొనసాగించారు.
ఇది కూడా చదవండి: Iraq: షాకింగ్ వీడియో: కొడుకు నోట్లో సిగరెట్.. గన్‌తో కాల్చిన తండ్రి..!
ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. దాదాపు 20 నిమిషాల పాటు ఈ గొడవ కొనసాగింది. కొంతమంది నెటిజన్లు యూనిఫాంను బట్టి బాలికలు బెంగళూరులోని బిషప్ కాటన్ బాలికల పాఠశాలకు చెందినవారని ట్వీట్లు చేశారు. అయితే పాఠశాల నుండి ఈ ఘర్షణ అంశంపై ఇంకా ఎటువంటి ప్రకటన వెలువడలేదు. వీడియో చూసిన నెటజనులు.. ‘‘మీరు ఈ వయసులోనే బాయ్‌ఫ్రెండ్ కోసం తన్నుకుచచ్చారు అంటే.. ఇంక మీరు చదివి ఉద్దరించినట్లే.. ఖర్చు దండగ.. ఇలాంటి పనికి మాలిన పనులు చేయడానికి సిగ్గుండాలి’’ అని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Context https://t.co/bpHsmaKUrR pic.twitter.com/gD4aMcuUUv
— seth (@sethwnnacukmeth) May 17, 2022
ఇది కూడా చదవండి: Bihar: చిలుక తప్పిపోయింది.. పట్టిస్తే ఊహించనంత నజరానా!