ప్రతి రోజు మనం ఎక్కాల్సిన బస్సు.. మన స్టాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ అయిపోయి ఉంటుంది. ఎవ్వరైనా సీటు ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తాం. ఎవ్వరూ ఇవ్వరూ. ఇక ఆ తోపులాటలోనే బస్సులో వేలాడుతూ వెళతాం. అయితే బస్సు సీటు విషయంలో ఇద్దరు మహిళలు జుట్టు పట్టుకుని తన్నుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
కాలేజీలకు, ఆఫీసులకు, ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే ఎక్కువగా బస్సును వినియోగిస్తుంటాం. ఆదివారం మినహా.. ప్రతి రోజు మనం ఎక్కాల్సిన బస్సు స్టాఫ్ దగ్గరకు వచ్చేసరికి ఫుల్ అయిపోయి ఉంటుంది. బ్రతుకు జీవుడా అని ఎక్కుతాం. ఎవ్వరైనా సీటు ఇవ్వకపోతారా అని ఆశగా చూస్తాం. ఎవ్వరూ ఇవ్వరూ. ఆ సమయంలోనే ట్రాఫిక్ కూడా అధికంగా ఉండటంతో బస్సులో వేలాడుతూనే మన గమ్య స్థానానికి చేరుకుంటాం. ఈ అనుభవాలను ప్రతి సగటు మనుషులు ఎదుర్కున్నవే.. ఎదుర్కొంటున్నవే. అయితే బస్సులో సీటు కోసం ఇద్దరు అమ్మాయిలు పొట్టుపొట్టున తన్నుకున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఓ బస్సు ప్రయాణీకులతో నిండి ఉంది. ఆ స్టాప్‌లోకి బస్సు రాగానే జనాభా ఎగబడి ఎక్కారు. ఆ వాహనంలో ఒకటి రెండు సీట్లు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. అయితే మహిళ, ఓ యువతి సీటు కోసం పోటీ పడ్డారు. ఆ సీటు విషయంలో వీరి మధ్య మొదలైన వాగ్వాదం చివరకు పెద్ద ఫైట్‌కు దారి తీసింది. ప్రయాణీకులున్నారన్న విషయం కూడా మర్చిపోయి ఈ ఇద్దరూ బస్సులో ఒకరికొకరు జుట్టు పట్టుకొని చాలా దారుణంగా కొట్టేసుకున్నారు. మిగతా ప్రయాణీకులు కూడా వీరిని ఆపలేదు. ఏదో సినిమా చూస్తున్నట్లు అలా ఉండిపోయారు. ఒక వ్యక్తి మాత్రం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. అది కాస్త వైరల్‌గా మారింది.
ఇద్దరూ ఒకరినొకరు కొట్టుకుంటూ వాదించుకోవడం వీడియోలో కనిపిస్తోంది. బస్సు డ్రైవర్ సైతం వాహనాన్ని ఆపేశారు. అయితే కొంత సమయం తర్వాత మహిళల మధ్య గొడవను ఆపేందుకు కొంత మంది ప్రయత్నించినప్పటికీ వారూ ఆగలేదు. కొట్టుకుంటూనే ఉన్నారు. చివరకు ఓ మహిళా కానిస్టేబుల్ వారిద్దరినీ బస్సులో నుండి వారిని వాహనంలో నుంచి బయటకు దింపడం కనిపించింది.అయితే, బస్సు దిగిన తర్వాత కూడా వారు ఒకరినొకరు కొట్టుకోవడం కనిపించింది. ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ముందే వారిద్దరూ మరోసారి దాడి చేసుకున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు.
Kalesh B/w Two Women Inside Government bus over seat issue pic.twitter.com/XiFSWH303W
— Gharkekaleshh (@gharkekaleshh) March 6, 2023