దాయాది దేశం పాకిస్తాన్.. భారత్ నుండి వేరు పడిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మెజార్టీ పీపుల్ ముస్లింలే. ఆ ప్రాతిపదికనే సంయుక్త భారత్ విడిపోయింది. అయితే పాకిస్తాన్.. తరచూ భారత్ పై విమర్శలు చేస్తూ నవ్వులు పాలు అవుతుంది.
దాయాది దేశం పాకిస్తాన్.. భారత్ నుండి వేరు పడిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ మెజార్టీ పీపుల్ ముస్లింలే. ఆ ప్రాతిపదికనే సంయుక్త భారత్ విడిపోయింది. అయితే పాకిస్తాన్.. తరచూ భారత్ పై విమర్శలు చేస్తూ నవ్వులు పాలు అవుతుంది. ముస్లింలు అందులోనూ పాక్ వంటి దేశాల్లో బహు భార్యత్వం ఉంది. ముస్లిం పురుషులు ఎంత మంది మహిళలనైనా పెళ్లి చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఓ పెళ్లి పెద్ద చర్చకు దారి తీసింది. అదే ఓ ముస్లిం వ్యక్తి.. తన కుమార్తెను వివాహం చేసుకుంటున్నాడంటూ నెట్టింట్లో ఓ వార్త హల్ చల్ చేస్తుంది. తన తండ్రిని ఇష్టప్రకారమే కుమార్తె వివాహం చేసుకున్నట్లు వార్తా కథనాలు పేర్కొంటున్నాయి. కాగా, అతడికి ఇది నాల్గవ పెళ్లి అట.
అసలు విషయం ఏంటంటే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ మహిళ.. తన తండ్రిని నాల్గవ వివాహం చేసుకుందట. దాన్ని కారణం చెప్పిదంటూ ఓ కథనం వచ్చింది. అదేమిటంటే.. ప్రతి తండ్రికి నాల్గవ సంతానంగా కుమార్తె పుడితే రబియా అనే పేరు పెడతారట. ఈ రబియా అనే పదం అరబు నుండి పుట్టింది. అరబిక్‌లో రబియా అంటే నాలుగు అని అర్థం. అయితే ఆమె తన తండ్రికి రెండవ కుమార్తె. ఆ పేరు జస్టిఫికేషన్ కోసం తాను నాల్గవ భార్యగా మారతాను అని చెప్పినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఇది కాస్త వైరల్ అవ్వడంతో ఈ వివాహంపై అనేక మంది నెటిజన్లు ఆడేసుకున్నారు. అంతేకాదూ.. ఆ యువతిని తిట్టిపోశారు. విమర్శలు, ప్రతి విమర్శలతో దాడి చేశారు. ఇదేం విడ్డూరం రా బాబు అంటూ తలలు పట్టుకున్నారు.
దీంతో దీనిపై సదరు యువతి స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాను మాట్లాడిన మాటలు వక్రీకరించారంటూ చెప్పుకొచ్చింది. తాను తన తండ్రిని వివాహం చేసుకోలేదని, తాను వీడియోలో పేర్కొన్నదని తప్పుగా అర్థం చేసుకున్నారని తెలిపింది. తాను ఓ వ్యక్తికి నాల్గవ భార్యగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఈ కన్ఫ్యూజన్ అంతా రబియా అన్న పేరు మూలంగా జరిగిందని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్లో నాల్గవ కుమార్తెతో ఈ పేరు ముడిపడి ఉన్నందున తాను చెప్పే వ్యాఖ్యలకు గందరగోళాన్ని సృష్టించారని పేర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాను తన తల్లిదండ్రులకు రెండవ కుమార్తెను అని, తన భర్తకు నాల్గవ భార్యను అని వెల్లడించింది.
Daughter justifying being 4th wife of her father pic.twitter.com/7vOrjGuBDD
— Hemir Desai (@hemirdesai) July 6, 2023