ఈ రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అనేది సర్వసాధారణం. ఏడాది పిల్లల నుంచి పండు ముసలవ్వల వరకు ప్రతీ ఒక్కరు బర్త్ డే సెలబ్రేషన్స్ లు ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక కొత్త బట్టలు ధరించుకుని కేక్ కట్ చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పుట్టిన రోజులతో పాటు పెళ్లి రోజులు, వర్ధంతి వంటి రోజులు అంటూ ఘనంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఇదిలా ఉంటే పెంపుడు కుక్కకు పుట్టిన రోజులు జరపడం ఎప్పుడైనా విన్నారా? పెంపుడు కుక్కకు పుట్టిన రోజు వేడుకలు ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. తాజాగా ఓ కుటుంబ సభ్యులు ఏడాది నుంచి పెంచుకుంటున్న వారి పెంపుడు కుక్కకు కుటుంబ సభ్యులు ఘనంగా పుట్టిన రోజు వేడుక జరిపించారు. అసలు ఈ విచిత్రమైన ఘటన ఎక్కడ జరిగింది? కుక్కు పుట్టిన రోజున ఆ మహిళ ఏమేం చేశారనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
అది జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ లో సుమిత్ర అనే మహిళ నివాసం ఉంటున్నారు. ఈ మహిళకు కుక్కలు అంటే ఎంతో ప్రాణం. వాటిని ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటూ ఇంట్లో ఓ మనిషి వల్లే ట్రీట్ చేస్తుంది. ఇక రోజు ఆ కుక్కకు మంచి మంచి ఆహారం పెట్టడంతో పాటు ప్రతీ రోజు స్నానం కూడా చేయిస్తుంది. అలా కొన్నేళ్ల నుంచి సుమిత్ర ఎంతో ఇష్టంతో కుక్కలను పెంచుకుంటుంది. ఇకపోతే సుమిత్ర గత ఏడాదిలో ఓ చిన్న పెంపుడు కుక్క పిల్లను తెచ్చుకున్నారు. అలా రోజులు గడిచే కాలానికి ఆ కుక్క వయసు సంవత్సరం దాటింది. ఈ క్రమంలోనే సుమిత్రకు తన పెంపుడు కుక్కకు పుట్టిన రోజు వేడుకను ఘనంగా చేయాలని అనుకుంది. అనుకోవడంతో పాట ఈ పుట్టిన రోజు వేడుక కోసం బర్త్ డే కార్డులు కూడా ప్రింట్ చేయించింది.
పుట్టిన రోజు కార్డులన్నీ తన బంధువుల అందరికీ చేరవేసింది. ఇక ఆ కుక్క పుట్టిన రోజు వేడుకకు సుమారుగా 350 కుటుంబ సభ్యులు హాజరయ్యారు. పుట్టిన రోజు సందర్భంగా సుమిత్ర కుక్కకు రూ.4500 విలువైన ఓ సూట్ ను తెచ్చింది. దీంతో బంధువుల సమక్షంలో కేక్ చేయడంతో ఆ కుక్క పుట్టిన రోజు వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు బంధువులు ఆ కుక్కకు అందరూ బహుమతులు తేవడంతో పాటు మూడు బంగారు లాకెట్ లు కూడా తీసుకొచ్చారు. ఇక ఇదే కుక్క పుట్టిన రోజు వేడుకను బంధువులు తమ తమ సెల్ ఫోన్ లలో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త వైరల్ గా మారాయి. అయితే ఈ కుక్క పుట్టిన రోజు వేడుకలపై స్పందించిన కొంతమంది నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కోలా కామెంట్స్ చేస్తున్నారు.
धनबाद में एक कुत्ते की ऐसी बर्थडे पार्टी हुई जो अच्छों-अच्छों की नहीं होती।
– डॉगी को 4500 का सूट पहनाया गया।
– आरती उतारी, फिर केक काटा।
– 350 लोग इस पार्टी में आए।
– मालकिन ने कुत्ते को 3 सोने के लॉकेट गिफ्ट किए।बाकी प्यार की बौछार तो वीडियो में दिख ही रही है। 🤫#Dog pic.twitter.com/gKpnTyE4Gu
— Gaurav Agrawal (@GauravAgrawaal) December 1, 2022