దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కువ. ఇక్కడ దేవుళ్లతో ముడిపడిన విశ్వాసాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా దేవాలయాలు, దేవుళ్ల విషయంలో చిన్నతప్పు జరిగినా సహించరు. దేవాలయాలను సందర్శించే సమయంలో కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాగే కొంత మంది సెలబ్రిటీలు ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి విదితమే.
భారత్ భిన్నత్వంలో ఏకత్వం దేశం అని చెప్పుకుంటున్నప్పటికీ.. హిందు రాజ్యంగానే పేరు పొందింది. దాన్ని కారణం లేకపోలేదు. ఎందుకంటే దేశంలో హిందూ దేవాలయాలు ఎక్కువ. ఇక్కడ దేవుళ్లతో ముడిపడిన విశ్వాసాలను ప్రజలు ఎక్కువగా నమ్ముతుంటారు. భక్తి, శ్రద్ధలతో పూజిస్తారు. ముఖ్యంగా దేవాలయాలు, దేవుళ్ల విషయంలో చిన్నతప్పు జరిగినా సహించరు. దేవాలయాలను సందర్శించే సమయంలో కొంత మంది అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు. అలాగే కొంత మంది సెలబ్రిటీలు ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుకున్న సంగతి విదితమే. నయనతార తిరుపతి మాడవీధుల్లో చెప్పులు వేసుకుని తిరిగిన ఘటన ఎంతటి వివాదం చెలరేగిందో అందరికీ తెలుసు. అలాగే ప్రస్తుతం ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్, హీరోయిన్ కృతిసనన్ ను తిరుపతి శ్రీవారి దేవాలయం ప్రాంగణంలో ముద్దు పెట్టుకున్న ఘటన తీవ్ర దుమారం రేగుతుంది.
ఇటువంటి ఇలాంటి వివాదానికి సంబంధించిన ఓ ఘటన తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే ఇద్దరు ప్రేమికులు.. ఓ గుడిలోకి వెళ్లి అసభ్యరమైన రీతిలో ఫోటోలకు ఫోజులిస్తే.. వారిని పట్టుకుని తన్నారు స్థానికులు. ఈ ఘటన జార్ఖండ్‌లోని ధన్ బాద్‌లో నిర్సా నయాదంగ కాళీ టెంపుల్‌లో చోటుచేసుకుంది. అందిన సమాచారం ప్రకారం.. ఒకే కాలేజీలో చదువుకుంటున్న అమ్మాయి, అబ్బాయి.. నయాదంగా కాళీ దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చారు. ఇక అసభ్యకరంగా ప్రవర్తిస్తూ.. సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ మొత్తం అక్కడే ఉన్న సీసీటీవి ఫుటేజ్ లో రికార్డయ్యింది.
ఇది చూసిన ఆలయ సంరక్షకులు, స్థానికులు వారిద్దరినీ పట్టుకుని ఉతికేశారు. అంతేకాదూ అమ్మాయిని బండ బూతులు తిట్టారు. ఆ మొత్తం వీడియోను వైరల్ చేశారు. అందులో వీరిద్దరనీ మోకాళ్లపై కూర్చొబెట్టి తిట్టారు. యువతి వేడుకున్నా, వదల్లేదు. అయితే ఈ వీడియోపై పోలీసులు స్పందిస్తూ.. ఈ ఘటనపై ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని, అయితే ప్రేమ జంటను పట్టుకోవడం, మందలించడాన్ని ఉపేక్షిస్తామని, కాగా, ఆడ పిల్లను దూషించడం, కొట్టడం పై మాత్రం చర్యలు తీసుకుంటామని అన్నారు. వీడియోలను వైరల్ చేయడం సరైన చర్య కాదని అన్నారు. అయితే యువతి ఆత్మహత్య చేసుకుందని వస్తున్న వార్తలు తప్పు అని కూడా చెప్పారు.