పెళ్లిలో అందంగా కనిపించాలని ఉబలాటం పెళ్లి కూతురికి కామన్. దీని కోసం బ్యూటి పార్లర్లను ఆశ్రయిస్తుంటారు. రకరకాల ఫేసిషియల్స్, బ్రైడల్ మేకప్స్ ట్రై చేస్తూ ఉంటారు. ఇదే ఓ మహిళ కొంప ముంచిందీ. ఆమెకు మేకప్ తెచ్చిన తంటా పెళ్లి ఆగిపోయేలా చేసింది.
జీవితంలో పెళ్లి మరుపురాని ఘట్టం. పెళ్లిలో అందంగా కనిపించాలన్న తపన వధూవరులకు ఉంటుంది. వరుడి కన్నా ఆ కుతాహలం వధువుకు కాస్త ఎక్కువే. అందంగా కనిపించేందుకు ముస్తాబు అవుతుంటారు. పెళ్లి దుస్తుల, నగలు నుండి మేకప్ వరకు అన్నింటిపై దృష్టి పెడతారు. ఫేసియల్ దగ్గర నుండి గోళ్లను అందంగా తీర్చిదిద్దే పెడిక్యూర్ వరకు ప్రతి దానిపై శ్రద్ధ చూపుతారు. దీని కోసం బ్యూటీ పార్లర్లను ఆశ్రయిస్తారు. బ్యూటీ పార్లర్లు సైతం బ్రైడల్ మేకప్ పేరుతో ఆకర్షిస్తూ ఉంటాయి. పెళ్లిలో అందంగా కనిపించాలన్న ఆ తపనే వధువు ముఖం మీదకు తెచ్చింది. మరో కొన్ని గంట్లో పెళ్లి అనగా.. బ్యూటీ పార్లర్ కు వెళ్లిన యువతి మొహం వికృతంగా మారింది. దీంతో పెళ్లి కూడా రద్దైంది.
కర్ణాటకలోని హస్సాన్ జిల్లాలోని అర్సికేరేలో జాజూర్ గ్రామానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. కొన్నిరోజుల్లో పెళ్లి ఉండటంతో మేకప్ కోసమని గంగాశ్రీ హెర్బల్ పార్లర్ అండ్ స్పాకు పెళ్లి కూతురు వెళ్లింది. ఈ క్రమంలో బ్యూటిషియన్.. పెళ్లి కుమార్తె ముఖానికి రకరకాల క్రీమ్స్ పూసింది. దీంతో ఆమె ముఖం కందిపోయి నల్లగా మారి బాగా ఉబ్బింది.ఈ మేకప్ కారణంగా అలెర్జీ రావడంతో ముఖం వాచిపోయింది. దీంతో పెళ్లి కుమార్తె తనను తాను చూసుకుని ఒక్కసారిగా అవాక్కయింది. ఆమెకు ఇంటికి చేరుకోగా.. చూసిన బంధువులు కూడా షాక్ కు గురయ్యారు. ఆమె మొహన్ని చూసి భయపడ్డ వరుడు కూడా పెళ్లి వద్దంటూ వెళ్లిపోయాడు.
తన మొహం వాయడంతో ఏంటనీ బ్యూటిషియన్ ను అడగ్గా.. కొత్త తరహా మేకప్ వేసినట్లు చెప్పింది. దీంతో ఇంటికి వెళ్లగా నల్లగా మారి, ఉబ్బిన ఆమె మొహన్ని చూసి పెళ్లి రద్దు చేసుకున్నాడు వరుడు. ఆమెకు మేకప్ వికటించడంతో ఐసియులో చికిత్స అందిస్తున్నారు. ఆ బ్యూటీషియన్ పై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు బ్యూటీషియన్‌ను విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ స్థానికంగా వైరల్ గా మారింది. పెళ్లిలో అందంగా ముస్తాబు అయ్యేందుకు పెళ్లి కుమార్తెలు పడుతున్న పాట్లు.. ఇలా ఇబ్బందులు గురి చేస్తుండటం పట్ల మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.