సాధారణంగా రోడ్లపై నిత్యం అనేక గొడవలు జరుగుతుంటాయి. చాలా మంది ఆ గొడవలు చూస్తూ వెళ్తారే కానీ ఎవరు పట్టించుకోరు. అయితే కొందరు మాత్రం ఆ వివాదాల్లో తలదూర్చి సమస్యను పరిష్కరిస్తారు. మరి కొందరు ఆ సమస్యల చిక్కుకోని ఇబ్బందుల పాలవుతారు. తాజాగా ఓ వ్యక్తికి, యువతికి మధ్య జరిగిన గొడవలో యువకుడు జోక్యం చేసుకున్నాడు. దీంతో అసల వ్యక్తి పక్కకు పోయి వీరిద్దరి మధ్య ఓ రేంజ్ ఫైట్ జరిగింది. గతంలో యూపీ ప్రాంతంలో నడ్డి రోడ్డుపై ఓ యువకుడిని కాళ్లతో తంతూ ఓ యువతి దాడి చేసింది. ఆ సమయంలో సదరు యువకుడు ఏమాత్రం ప్రతిఘటించ లేదు. కానీ ఇక్కడ మాత్రం తనపై చెెంప దెబ్బలు కొడుతున్న యువతిపై యువకుడు ఓ రేంజ్ లో రెచ్చిపోయి ప్రతిదాడికి దిగాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతోంది.
ఒడిశా లో జరిగినట్లు తెలుస్తున్న ఈ వీడియోలో.. ఓ యువతి బైక్ పై ఉన్న వ్యక్తిపై దాడి చేస్తోంది. ఇదే క్రమంలో అక్కడ ఉన్న వారు చూస్తూనే ఉన్నారు కానీ ఎవరు అడ్డుకోలేదు. అయితే అటుగా వెళ్తున్న ఓ ఫుడ్ డెలీవరి బాయ్ ఆ యువతిని ఆపే ప్రయత్నం చేశాడు. యువతి మాత్రం మరింత రెచ్చిపోయి నన్ను ఆపడానికి నువ్వు ఏవరు అంటూ ఆ యువకుడిపై అరచింది. నేను పబ్లిక్ ని.. ఇక్కడ నీవు న్యూసెన్స్ చేస్తూంటే అడిగే హక్కు ఉందన్నాడు. దీంతో మరింత రెచ్చిపోయిన ఆ యువతి సదరు యువకుడిపై కూడా దాడికి దిగింది. మాములుగా అయితే అందరూ అమ్మాయి కదా అని వదిలేస్తారు. కానీ ఈ యువకుడు మాత్రం అలా కాకుండా సదరు యువతిపై ప్రతిదాడి చేశాడు. ఇక ఇద్దరు రోడ్డుపై ఓరేంజ్ లో ఫైటింగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.మీరు ఓలుక్కేసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.