యువకుడు ఓ దుకాణానికి వెళ్లి నీట్ గా వాచ్ దొంగతనానికి పాల్పడ్డాడు. షాపు ఓనర్ తో మాట్లాడుతున్నట్టు నటిస్తునే స్మార్ట్ గా వాచ్ దొంగిలించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది.
దొంగతనం.. ఎలాంటి పని పాట లేకుండా గల్లీల్లో అరుగులపై కూర్చునే యువకులు చేసే పని. అంతే కాకుండా కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించాలనే వారు సైతం ఇలా దొంగతనాలకు పాల్పడుతుంటారు. మరీ ముఖ్యంగా ఈ రోజుల్లో రోడ్లలపై మహిళల మెడలో బంగారు గొలుసులు దోచేస్తూ తెలివిగా చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ యువకుడు ఓ షాప్ లో నీట్ గా వాచ్ దొంగతనం చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సైతం వైరల్ అవుతోంది.
నేటి కాలంలో దొంగతనాలు చాలా స్మార్ట్ గా, నీట్ గా జరుగుతున్నాయి. సరిగ్గా ఆలోచించిన ఓ కుర్రాడు.. వాచ్ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తర్ ప్రదేశ్ గోండా పరిధిలోని ఓ ప్రాంతంలో ఓ యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు చదువు మానేసి చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడు. ఇందులో భాగంగానే వరుస దొంగతనాలకు పాల్పడుతున్నాడు. అయితే ఇటీవల ఆ యువకుడు గోండా ప్రాంతంలో ఉన్న ఓ వాచ్ దుకాణానికి వెళ్లాడు. వాచ్ కొనుగోలు చేస్తానని చెప్పడంతో ఆ షాప్ ఓనర్ కొత్త వాచ్ లన్నీ అతనికి చూపించాడు.
ఇక ఇదే మంచి సమయం అనుకున్న ఆ యువకుడు.. అతనితో మాట్లాడుతున్నట్టు నటించి.. మెల్లగా ఓ వాచ్ జేబులో పెట్టుకున్నాడు. ఇక వచ్చిన పని అయిపోయిందనుకుని అటు ఇటు చూసి బయటకు వచ్చి బైక్ ఎక్కి తుర్రుమంటూ వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. అదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కాస్త వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన చాలా మంది నెటిజన్స్.. దొంగతనం ఇలా కూడా చేస్తారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. షాప్ లో నీట్ గా వాచ్ కొట్టేసిన ఈ యువకుడి దొంగతనం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
stole pic.twitter.com/SEXVWQDfSk
— Hardin (@hardintessa143) March 11, 2023