ప్రపంచంలో ఉన్న ఏడు వింతల్లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ లో ఉన్న ఈఫిల్ టవర్ కూడా ఒకటి అని అందరికీ తెలిసిందే. ఎంతో మంది పర్యాటకులతో ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతం అది. అలాంటి ప్రాంతంపై బాంబు దాడి జరిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఈఫిల్ టవర్ పై బాంబు దాడి జరిగినట్లు దృశ్యాలు ఉన్నాయి. టవర్ కు దూరంగా ఓ యువతి ఫొటో దిగుతుండగా ఒక్కసారిగా ఈఫిల్ టవర్ పై బాంబుల వర్షం కురిసినట్లు ఆ వీడియోలో ఉంది.
ఇదీ చదవండి: రైలు దిగుతూ పడిపోయిన వ్యక్తి.. కాపాడిన కానిస్టేబుల్
వివరాల్లోకి వెళ్తే.. ఉక్రెయిన్ కి చెందిన వెర్ఖోవ్నా రాడా అనే యువతి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేసింది. అయితే ఇది ఫేక్ వీడియో. ఈఫిల్ టవర్ పై ఎలాంటి దాడి జరగలేదు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం సందర్భంగా ఈ వీడియో విడుదల చేశారు. యూరప్ లో భాగంగా ఉన్న ఉక్రెయిన్ నాశనం అయితే యూరప్ కూడా పతనం అవుతుందని హెచ్చరించారు. పుతిని ఒక్క ఉక్రెయిన్ తో ఆగడని యూరప్ లో ఉన్న మిగిలిన రాజధానులను కూడా నాశనం చేస్తాడంటూ వాళ్లు హెచ్చరించారు. యూరప్ గగనతలం మూసేయాలంటూ ఉక్రెయిన్ దేశాలను కోరుతోంది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సెషన్ గా మారింది. ఇప్పటికే 21 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. 2 వేలకు పైగా లైక్స్, 1100 మందికిపైగా రీట్వీట్ చేశారు. ఈ వీడియోలో విజువల్స్ చూసి నిజంగా దాడి జరిగిన భావన కలిగిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది యూరప్ దేశాలు ఉక్రెయిన్ సహాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Would the famous Eiffel Tower in #Paris or the Brandenburg Gate in #Berlin remain standing under endless bombing of Russian troops?
Do you think that does not concern you?
Today it’s #Ukraine, tomorrow it will be the whole of #Europe. Russia will stop at nothing. pic.twitter.com/vi6z5UWV8q— Verkhovna Rada of Ukraine (@ua_parliament) March 11, 2022