ప్రకృతి ఎంత రమణీయంగా ఉంటుందో.. ఒక్కోసారి అంతే ప్రమాదకారిగా మారుతుంటుంది. సోషల్ మీడియాలో ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్నిసార్లు కొండలు విరిగిపడటం, సముద్రాలు ఎగిసి పడటం, జోరు వానకు ఇళ్లు కొట్టుకు పోవడం ఇలా ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కానీ, జోరు వానతో పాటు కొన్నిసార్లు ఉరుములు, మెరుపులు, పిడుగులు కూడా వస్తుంటాయి. విదేశాల్లో అయితే పెద్ద పెద్ద సుడిగాలులు(టోర్నెడోస్) కూడా వస్తుంటాయి. అయితే ప్రస్తుతం ఓ కారుపై పిడుగు పడిన వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది. వర్షంలో ఆగి కారు వెనక్కు తిప్పుతుండగా పిడుగు పాటుకు గరైంది. పక్కనే ఆగి ఉన్న కారులోని వ్యక్తి వీడియో తీస్తుండగా రికార్డు అయ్యింది. ఒకరకంగా కారులోని వాళ్లు అదృష్టవంతులనే చెప్పాలి. ఆ వైరల్ మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.