స్కూల్ ప్రిన్సిపాల్ ను చితకబాదిన 9వ తరగతి స్టూడెంట్స్. అవును మీరు విన్నది నిజమే. ఇటీవల స్కూల్ లోనే స్టూడెంట్స్ అందరూ కలిసి లేడీ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు.
స్కూల్ ప్రిన్సిపాల్ ను చితకబాదిన 9వ తరగతి స్టూడెంట్స్. వినటానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. స్టూడెంట్స్ అంతా ఏకమై ప్రిన్సిపాల్ ను దారుణంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో కూడా ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన చాలా మంది వారిపై చర్యలు తీసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే? అది అమెరికా టెక్సాస్ లోని వెస్ట్ ఫీల్డ్ హై స్కైల్. ఈ పాఠశాలలో చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.
అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, ఆ స్కూల్ అసిస్టెంట్ ప్రిన్సిపాల్ పై 9వ తరగతి విద్యార్థులు అంతా పగ పెంచుకున్నారు. సమయం కోసం వేచి చూశారు.. అది కూడా రావడంతో స్కూల్ లోనే ఆమెను కిందపడేసి విచక్షణ రహితంగా పిడు గుద్దులు గుద్దారు. ఇక ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తూ ప్రిన్సిపాల్ కు చుక్కలు చూపించారు. ఇదంతా అక్కడే ఉన్న మరి కొంతమంది స్టూడెంట్స్ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. అదే వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది ఒక్కోరు ఒకలా కామెంట్స్ చేస్తున్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ ను చితకబాదిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) May 4, 2023