ఏలియన్స్.. ఈ పేరు విన్న ప్రతిసారి మనలో తెలియని ఆసక్తితో పాటు టెన్షన్ కూడా మొదలవుతుంది. ఒకవేళ ఏలియన్స్ నిజంగా ఉంటే మాత్రం.. వాటికి మనిషికంటే ఎక్కువ శక్తి సామర్థ్యాలు – తెలివి ఉండే అవకాశం ఉందని సైంటిస్టులు చెబుతూ వస్తున్నారు. కొన్నేళ్లుగా ఏలియన్స్ పై రీసెర్చ్ కూడా జరుపుతున్న సంగతి తెలిసిందే. యూఎఫ్ఓ(అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్)లను చూశామని కొందరు చెబుతున్నారు. ఒకవేళ నిజంగా ఉంటే భూమి మీదికి ఎందుకు రాలేకపోతున్నాయి? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
అయితే.. తాజాగా మరోసారి ఏలియన్స్ టాపిక్ చర్చల్లోకి వచ్చింది. ఎందుకంటే తాజాగా ఓ పైలట్ తీసిన వీడియో అందుకు కారణమైంది. ఓ పైలట్ పసిఫిక్ మహా సముద్రం మీదుగా విమానంలో ప్రయాణిస్తుండగా.. కొంత దూరం వెళ్ళాక నాలుగు చుక్కలు ఒకదాని పక్కన ఒకటి ప్రయాణించిటం గమనించాడు. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే పైలెట్ ఆశ్చర్యంతో తన కెమెరాలో బంధించాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో కొంత దూరం వెళ్ళాక చుక్కలు మాయమవడంతో.. అవి ఏలియన్స్ కి సంబంధించిన యూఎఫ్ఓ లని నెటిజన్లు సందేహపడుతున్నారు.
గతంలో ఇలాంటి వీడియోలు చాలా వచ్చాయి. కానీ వాటిలో ఇది కాస్త ఆశ్చర్యకరంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అన్ ఐడెంటిఫైడ్ ఫ్లైయింగ్ ఆబ్జెక్ట్(యూఎఫ్ఓ) అంటే.. ఆకాశంలో ఎగురుతూ కనిపించే గుర్తు తెలియని వస్తువు లేదా ఏలియన్స్ ఫ్లైయింగ్ మిషిన్ అంటారు. ఎయిర్ క్రాఫ్టులు లేదా స్పేస్ షిప్లు రాడార్ సిగ్నల్స్ కలిగి ఉంటాయి. కానీ యూఎఫ్ఓ లకు రాడార్ సిగ్నల్స్ ఉండవు.
కొన్నిసార్లు ఆకాశంలో ఎగురుతూ వేరే మిషన్లు తారసపడతాయి. అలాంటివి వేరే గ్రహాల నుంచి వచ్చే మిషన్స్ గా సైంటిస్టులు చెప్తుంటారు. ఈ వీడియో పై మీరు ఓ లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.
A pilot claims he saw a fleet of #UFOs over the Pacific Ocean. The video was shot at around 39,000 feet. 🛸👽
The suspected #alien aircraft took the form of ‘weird’ rotating lights moving across the sky. 😳
What are your thoughts on the footage? 👀🤔 pic.twitter.com/N0I2WS2kYq
— Chillz TV (@ChillzTV) December 7, 2021