మృగశిర కార్తె ప్రారంభం రోజు అందరూ చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అసలు మృగశిర కార్తె చేపలు ఎందుకు తింటారో తెలుసా?
రోహిణి కార్తే ఎండలతో ముగింపు పలకగానే మృగశిర కార్తె ప్రవేశిస్తుంది. ఆ రోజు ప్రతీ ఒక్కరూ ఇంట్లో చేపలు వండుకుని తింటుంటారు. దీంతో ఆ రోజు చేపల మార్కెట్లన్నీ జనంతో కిక్కిరిపోతాయి. అయితే, మృగశిర కార్తె రోజు చేపలే ఎందుకు తింటారనే ప్రశ్న అందరి మెదళ్లను తొలుస్తూ ఉంటుంది. అసలు నిజంగా మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారు? దీని వెనక ప్రజలకు ఉన్న నమ్మకం ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రోహిణి కార్తేలో ఎండలు దంచికొడతాయి. ఈ కార్తెలో జనాలంతా చల్లటి ఆహార పదర్థాలు తీనేందుకు ఇష్టపడుతుంటారు. రోహిణి కార్తే ముగియగానే మృగశిర కార్తె వస్తుంది. ఈ కార్తె ప్రారంభం రోజు మాత్రం అందరూ చేపలు తినేందుకు ఆసక్తి చూపిస్తారు. ఇక చేపల మార్కెట్లే కాకుండా రోడ్లపై కూడా చేపలు కొనేందుకు జనాలు బారులు తీరుతారు. ఈ పద్దతి ఆనాదిగా వస్తోంది. కానీ, మృగశిర కార్తె రోజు చేపలే ఎందుకు తింటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనికి ఓ కారణం ఉందని కొందరు ప్రజలు చెబుతున్నారు.
రోహిణి కార్తెలో ఎండలు విపరీతంగా కొడతాయి. ఆ తర్వాత వచ్చే మృగశిర కార్తెలో మాత్రం వెంటనే వాతావరణంలో మార్పులు సంభవించి ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇదే కాకుండా అప్పటి నుంచి చల్లటి గాలులు వీస్తూ తొలకరి చినుకులు ప్రారంభమవుతాయి. దీంతో శరీరాన్ని వేడిగా ఉంచేందుకు అందరూ చేపలు తింటుంటారు. ఇక చేపలు తినడం ద్వారా ఆస్తమా, గుండెజబ్బులు రోగులకు కాస్త ఉపశమనం లభిస్తుందని ప్రజలు నమ్ముతారు. మృగశిర కార్తె నుంచి వర్షాలు కురుస్తాయి. దీంతో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు.
ఇక చేపల్లో హ్యుమానిటీ పవర్ ఎక్కువగా ఉండడంతో మృగశిర కార్తె రోజు చేపలు తింటుంటారు. ఇదిలా ఉంటే, ఆస్తమా, ఉబ్బసం వ్యాధులను అరికట్టేందుకు బత్తిని బ్రదర్స్ హైదరాబాద్ లో మృగశిర కార్తె ప్రారంభంలోలనే చేప మందు ప్రసాదం చేస్తుంటారు. ఈ మందు తీసుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు వేలాదిగా తరలివస్తారు. ఇక జూన్ 9న హైదరాబాద్ లో బత్తిని బ్రదర్స్ ఆధ్వర్యంలో ఈ చేప మందు ప్రసాదం జరుగనుంది. ఈ ప్రసాదం తీసుకునేందుకు ఇప్పటికే చాలా మంది హైదరాబాద చేరుకున్నారు.