జూన్ మాసంలో ఎండలు తగ్గుముఖం పడతాయని అంటారు. ఏప్రిల్, మే నెలలో ఎండ వేడికి ప్రజలు ఉక్కిరి బిక్కరి అవుతారు. జూన్ మాసం.. మృగశిర కార్తి వచ్చి వారం అవుతున్నప్పటికీ భానుడు తన ప్రతాపాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎండ వేడి, వడగాల్పులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా మృగశిర కార్తి వచ్చిందంటే వాతావరణం చల్లబడుతుంది. కానీ ప్రస్తుతం దీనికి పూర్తి విరుద్దంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఏప్రిల్, మే నెలలో ఎండలు సర్వసాధారణం.. జూన్ మాసంలో ఎండ ప్రభావం చాలా వరకు తగ్గుతుందని అంటారు. కానీ జూన్ నెల మధ్యలోకి వచ్చినా ఎండలు మండిపోతున్నాయి. దీనికి తోడు వడగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. ఉదయం 6 నుంచే ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఏప్రిల్, మే నెలలో ఎండలు దంచికొట్టాయి.. జూన్ మాసంలో కాస్త ఉపశమనం దొరుకుతుందని అనుకుంటే.. ప్రస్తుతం ఎండలు చండ ప్రచండంగా మారాయి. పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, తగ్గని ఎండలతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. దీనికి తోడు కొన్ని ప్రాంతాల్లో కరెంట్ కోతతో చిన్నా పెద్ద ఉక్కపోతతో నానా తిప్పలు పడుతున్నారు. వేసవి తాపానికి తాళలేక పదే పదే నీళ్లు తాగడం, శీతలపానియాల వైపు పరుగులు తీయడం చేస్తున్నారు. ఓ వైపు నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చాయి.. మృగశిర కార్తె వచ్చి వారం రోజులు అవుతుంది.. ఏరువాక పనులు కూడా మొదలయ్యాయి. కానీ సూర్యుడు తన ప్రతాపాన్ని మరింత ఉధృతం చేస్తున్నట్లు కనిపిస్తుంది. రోజు రోజుకీ ఎండలు పెరిగిపోతున్నాయి.. 45 డిగ్రీల సెల్సీయస్ వరకు నమెదు అవుతుంది. ఇదే పరిస్తితి కొనసాగితే జూన్ 17 వరకు ఎండలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరో మూడు రోజలు పాటు తీవ్రంగా ఎండలు, వడగాల్పుల ప్రభావం కొనసాగే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. రేపు 248 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఇళ్ళలో ఉన్నవారే అనారోగ్యానికి గురవుతున్నారు. చాలా మంది వడదెబ్బ కారణంగా ఆస్పత్రిపాలవుతున్నారు. జూన్ మాసంలో ఎండలు తగ్గుముఖం పట్టాల్సి ఉంది.. కానీ మృగశిర కార్తెలో కూడా ఉక్కపోత విపరీతంగా ఉండడంతో ప్రజలు ఆందోళనలు చెందుతున్నారు. అత్యవసర పనులు అయితేనే బయటకు రావాలని హెచ్చరించింది.