ఈ భూమ్మీద సూర్యశక్తితోనే జీవరాశుల మనుగడ జరుగుతుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే సూర్యశక్తిని భూమ్మీద ఉత్పత్తి చేసేందుకు చైనా కొన్నాళ్ల కిందటే పరిశోధన చేపట్టిన విషయం తెలిసిందే. చైనా కృత్రిమ సూర్యుడు.. ఎక్స్‌పరిమెంటల్ అడ్వాన్స్‌డ్ సూపర్‌కండక్టింగ్ టొకమాక్(EAST) ఫ్యూజన్ ఎనర్జీ రియాక్టర్ తాజాగా సరికొత్త రికార్డు నమోదు చేసింది. సూర్యుడిలో శక్తి ఉత్పత్తి చెందే ప్రక్రియను అనుకరించే ఈ EAST రియాక్టర్.. తాజాగా 1056 సెకెన్ల పాటు(అంటే 17 నిమిషాలకుపైగా) ప్రజ్వలించి సుమారు 7కోట్ల […]
రోజూ కాసేపు సూర్యకిరణాల ఎదురుగా గడిపినా చాలు. శరీరానికి అవసరమైన డి విటమిన్ అంది అనారోగ్యం దరిచేరదు. సూర్యభగవానుడు అన్ని జీవుల పట్ల సమృదృష్టి కలిగినవాడు. ఆరోగ్యప్రదాత. సూర్యుడు లేనిదే చెట్లు, మొక్కలు మున్నగు వృక్షజాతులు మనలేవు. అందుకే ఆయనకు మిత్రుడని పేరు. సకల ప్రాణులు సూర్యునిపైనే ఆధారపడి ఉన్నాయని రుగ్వేదం చెబుతోంది. అంతేగాక ఆయన ప్రత్యక్ష దైవం. ‘మిత్ర’, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత, అర్క, భాస్కర అనే […]
జగతికి ప్రత్యక్ష దైవం సూర్యుడు. సృష్టికారకుడైన సవితగానూ, స్థితికారకుడైన మిత్రునిగానూ, మృత్యుకారకుడైన మార్తాండునిగానూ ఈ విశ్వంలో ఆయన వెలుగొందుతున్నాడు. మన దేశంలో సూర్యుణ్ణి వేదకాలం నుంచి ఆరాధిస్తున్నారు. సూర్యారాధనతో సమస్త పాపాలూ నశిస్తాయనీ, ఆరోగ్యం చేకూరుతుందనీ అనాదిగా వస్తున్న విశ్వాసం. రామాయణ కాలంలో శ్రీరామచంద్రుడు సూర్యుణ్ణి ఆరాధించి, అగస్త్య మహర్షి నుంచి పొందిన ‘ఆదిత్య హృదయా’న్ని స్తోత్రం చేసి, రావణుణ్ణి సంహరించాడు. హనుమంతుడు సూర్యుణ్ణి ఆరాధించి నవ వ్యాకరణవేత్త అయ్యాడు. మహాభారతంలో ధర్మరాజు కూడా సూర్యారాధనతో అక్షయపాత్రను […]