సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పపడిన నిందితుడు రాజుపై యావత్ భారత దేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కామాంధులను నడిరోడ్డుపై ఉరి వేయాలని పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ క్రమంలో రాజు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని వార్తలు వెలుగులోయి వచ్చాయి. దాంతో కామాంధుడికి తగిన శాస్తి జరిగిందని ఆనంద పడ్డారు. అయితే చిన్నారి కుటుంబ సభ్యులను పలువురు సినీ, రాజకీయ నేతలు కలిసి ఓదార్చారు. ఈ క్రమంలో చిన్నారి హత్య తర్వాత ఆమె కుటుంబ సభ్యులను షర్మిల పరామర్శించారు. ఈ ఘటనకు నిరసనగా ఆమె దీక్ష కూడా చేపట్టారు. తాజాగా ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన నిందితుడు రాజును దేశభక్తుడు భగత్ సింగ్ తో పోల్చారు వైఎస్ షర్మిల. వయసును పోల్చుతూ ఆమె వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది.
వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. రాజు వయసు 30 ఏళ్లు అని చెప్పిన షర్మిల.. భగత్ సింగ్ అంతకన్నా చిన్న వయసులోనే దేశం కోసం తన ప్రాణాలు అర్పించి దేశ భక్తి చాటుకున్నాడని.. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాపోయారని అన్నారు. రాజు ఎలా చనిపోయాడు? ఎందుకు చనిపోయాడు? అని ప్రశ్నించారు షర్మిల. దీంతో దేశ భక్తుడితో.. నీచుడిని పోల్చడం వివాదానికి దారితీసింది. ఇవాళ యువత ఒక ఆశయం అంటూ లేకుండా బతుకుతోందని చెప్పుకొచ్చారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ సమంయలో సరైనవి కావని.. రేపిస్ట్ రాజు విషయంలో భగత్ సింగ్ లాంటి గొప్ప వ్యక్తి పోలిక తేవడం అది కాస్తా పెడార్థానికి దారితీసి వివాదాస్పదమైంది. తాజాగా దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి.
రేపిస్ట్ రాజును భగత్ సింగ్ తో పోల్చిన ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారి సోదరి షర్మిల pic.twitter.com/b81JkJrcZM
— Rocky Bhai🤘 (@TheRockyBhai) September 17, 2021