ఆమె పట్టుతప్పి ట్రైన్- ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె ఎడమ కాలు పూర్తిగా నుజ్జు నుజ్జయిపోయింది. అతి కష్టం మీద రైల్వే సిబ్బంది ఆమెను బయటకు తీశారు.
ఈ మధ్య కాలంలో రైల్వే స్టేషన్లలో ప్రమాదాలు జరగటం బాగా పెరిగిపోయింది. రైలు ఎక్కేటప్పుడు.. దిగేటప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో ప్రయాణికులు గాయాలపాలవ్వటమో.. లేక చనిపోవటమో జరుగుతోంది. గతంలో రైలు, ఫ్లాట్ ఫామ్‌ల మధ్య ఇరుక్కుని చాలా మంది గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కొందరు చనిపోయారు కూడా. తాజాగా, ఓ మహిళ రైలు ఎక్కుతుండగా ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి రైలు, ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన నాగేశ్వరరావు, కల్యాణి భార్యభర్తలు.
నాగేశ్వరరావు రైల్వేలో ఉద్యోగిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా, నాగేశ్వరరావు తన భార్య కల్యాణిని తీసుకుని ఖమ్మం ఆసుపత్రికి చెకప్ కోసం తీసుకువెళ్లాడు. చెకప్ అయిపోయిన తర్వాత ఇద్దరూ ఖమ్మం నుంచి మధిరకు వెళ్లడానికి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. స్టేషనల్‌లో ఉండగా.. ఇంటర్ సిటీ ట్రైన్ వచ్చింది. నాగేశ్వరరావు ముందుగా ట్రైన్ ఎక్కాడు. అతడి వెనకాలే కల్యాణి ట్రైన్ ఎక్కబోయింది. ఈ నేపథ్యంలోనే ట్రైన్ ముందుకు కదలటంతో కల్యాణి పట్టు తప్పింది. నేరుగా ట్రైన్, ఫ్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయింది.
ట్రైన్ కొంచెం ముందుకు కదలటంతో ఆమె ఎడమకాలుకు బాగా గాయం అయింది. కాలు పూర్తిగా నుజ్జునుజ్జయింది. విషయం తెలుసుకున్న లోకో పైలెట్ ట్రైన్‌ను ఆపేశాడు. రైల్వే సిబ్బంది అతి కష్టం మీద కల్యాణిని అక్కడినుంచి బయటకు తీశారు. ఆ వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.