Warangal Rahul Inspirational Story: ‘‘ పడ్డ వాడే కష్టపడ్డ వాడే పైకి లేచే ప్రతోడు.. ఒక్కడైన కానరాడే జీవితాన్ని పోరాడకుండ గెలిచినోడు ’’ .. అవును దేవడు ఇచ్చిన జీవితంతో పోరాడకుండా గెలిచిన వాళ్లు ఎవ్వరూ లేరు. ఎన్నో కష్టాలు.. కన్నీళ్లను దాటుకుంటే తప్ప మనం అనుకున్నది సాధించటం కష్టం. అన్ని ఉన్నా.. శరీరంలో ఏ లోపం లేకపోయినా చాలా మంది తమను తాము ఎందుకు పనికిరాని వారిలా భావిస్తుంటారు. కొన్ని ఇబ్బందులు మొదలవ్వగానే చెయ్యాలనుకున్న పనిని పక్కన పడేస్తుంటారు. నా జీవితం అంతే అనుకుని సరిపెట్టుకుంటారు. అలాంటి వారికి స్పూర్తిగా నిలుస్తున్నాడు దివ్యాంగుడైన రాహుల్. తన లోపం కారణంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొని నేడు పదిమందికి సాయం చేసే స్థాయికి ఎదిగాడు.
వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాకు చెందిన రాహుల్ పుట్టటమే శారీరక లోపంతో పుట్టాడు. దీంతో వైద్యులు అతడ్ని చెత్త బుట్టలో ఉంచారు. పిల్లాడు బ్రతికే అవకాశం కూడా కష్టం.. ఒక వేళ బతికినా శారీరక, మానసిక వైకల్యం ఉండిపోతది. బతికినంత కాలం మీకు నరకం తప్పదు. ఇప్పడే పిల్లాడి మీద ఆశలు వదిలేసుకోండి అని అతడి తాతకు చెప్పారు. ఆయన ఎదేమైనా పిల్లాడు కావాలన్నారు. ఆపరేషన్ తర్వాత పిల్లాడు బ్రతికాడు. అయితే 90 శాతం వైకల్యం ఉండిపోయింది. దీంతో చదువుకోసం చాలా ఇబ్బందులు పడ్డాడు. ఫిజియోథెరపీలో సీటు వచ్చినట్లే వచ్చి తన వైకల్యం కారణంగా కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. కానీ, బతికిపోయాడు. చావటానికి చాలా ప్రయత్నాలు చేసి బతికి బయటడ్డాడు. తర్వాత ఓ శ్రేయోభిలాషి ఇచ్చిన సలహాతో న్యాయవాద చదువులో చేరాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాల విషయంలోనూ చాలా ఇబ్బందులు పడ్డాడు. అన్నీ విధాలా అర్హత ఉన్నా. వైకల్యం కారణంగా జాబ్ వచ్చేది కాదు. ఈ నేపథ్యంలో ఇండియా బైస్ ఫౌండర్ యశ్వంత్ దేవిశెట్టి.. రాహుల్‌కు ఉద్యోగం ఇచ్చాడు. తనలో ఓ దైర్యాన్ని నింపాడు. అంతేకాదు! అతనిలాంటి వాళ్లకు రాహుల్ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నాడు. ప్రస్తుతం రాహుల్ తాత గారిపేరిట ఓ పౌండేషన్‌ను నెలకొల్పాడు. దివ్యాంగులకు, అనాథలకు సహాయం చేస్తున్నాడు. రాహుల్ స్పూర్తిదాయక కథపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : గంజాయికి బానిసైన కొడుకు.. స్తంభానికి కట్టేసి తల్లి ఘాటు ట్రీట్మెంట్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.