మెగా హీరో, మెగాస్టార్ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డుప్రమాదం లో తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే ప్రథమ చికిత్స కోసం మాదాపూర్ లోని మెడికవర్ ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం సాయంత్రం 7-30 ప్రాంతంలో మాదాపూర్‌లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై నుంచి అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కిందపడిపోయాడు. దీంతో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.
రోడ్డుపై మట్టి, బురద ఉండడం వల్లే స్పోర్ట్స్ బైక్ స్కిడ్ ప్రమాదం జరిగినట్లు అంచనాకు వచ్చిన సంగతి తెలసిందే.. ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ కాలంలో రోడ్డు పై ఏదైనా ప్రమాదం జరిగితే మాకెందుకు వచ్చిన గొడవ అంటూ చాలా మంది పక్కకు తప్పుకొని పోతుంటారు. ఎవరో దయార్థహృదయులు మాత్రమే బాధితుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దగ్గరుండి మరీ ఆసుపత్రికి చేరుస్తారు. మరికొంత మంది 108 కి ఫోన్ చేస్తుంటారు. తాజాగా సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై కిందపడి తీవ్ర గాయాలైన సమయంలో 108 నంబరుకు ఫోన్ చేసి సమాచారమిచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా?.. సీఎంఆర్ సంస్థలో వ్యాలెట్ పార్కింగులో పనిచేస్తున్న అబ్దుల్. అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడకు చెందిన అబ్దుల్ నిజాంపేటలో పని ఉండడంతో కేబుల్ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నారు.
సాయితేజ్ ప్రమాదానికి గురికావడంతో వెంటనే స్పందించిన ఆయన బైక్‌ను పక్కన నిలిపి వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అక్కడే ఉండి అంబులెన్స్ వచ్చాక సాయితేజ్‌ను అందులోకి ఎక్కించారు. ఆ తర్వాత ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇస్లావత్ గోవింద్ కూడా వెంటనే స్పందించారు. డయల్ 100 నుంచి ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న ఆయన ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ పోలీసులకు సమాచారం అందించారు. బాధ్యత పౌరుడిగా అబ్దుల్ వెంటనే స్పందించి 108 ఫోన్ చేయడం.. ఇస్లావత్ గోవింద్ వెంటనే 100 కి ఫోన్ చేయడం వల్ల సాయిధరమ్ ప్రాణాలతో బయట పడ్డారని పోలీసులు తెలిపారు.