పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా భారీ కలెక్షన్స్ ని రాబట్టింది. పవన్ కెరీర్ లోనే అత్యంత ఫాస్ట్ గా రికార్డ్ కలెక్షన్స్ ని రాబట్టింది.
స్టార్ హీరో సినిమాకు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఓపెనింగ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయి. మొదటి వారం అంతా అడ్వాన్స్‌లతో బుక్ అవుతాయి. దీని వలన మొదటి వారం వసూళ్ళకు ఎలాంటి ఢోకా ఉండదు. అందులోనూ పవర్ స్టార్ సినిమా అంటే ఇంకెలా ఉంటుందో ఉహించుకోవచ్చు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన బ్రో సినిమా జూలై 28న విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా రిలీజై మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. పవర్ స్టార్ స్క్రీన్ మీద కనబడితే చాలు వసూళ్ల వరద కురుస్తుందని మరోసారి రుజువు చేసింది బ్రో మూవీ. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతం’ చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించగా, త్రివిక్రమ్ మాటలు అందించారు.
బ్రో సినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఏకంగా రూ. 48 కోట్లు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. పవన్ కెరీర్ లో ఫస్ట్ డే ఎక్కువ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా బ్రో నిలిచింది. రెండో రోజు కూడా అదే జోరు కొనసాగిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా రూ. 27 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. మొత్తం రెండు రోజుల్లో రూ. 75 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక మూడవ రోజు రూ. 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి బ్రో సినిమా ఏకంగా మూడు రోజుల్లోనే 101 కోట్ల 54 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. దీంతో మూడు రోజుల్లో పవన్ కెరీర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా బ్రో నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. మామ, అల్లుడు కలిసి బాక్సాఫీస్ వద్ద దండయాత్ర కొనసాగిస్తూ.. వసూళ్ల వరద కురిపిస్తున్నారు. ఇక ఈ వారంలో పెద్ద సినిమాలు లేకపోవడంతో కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.
అంతకు ముందు అత్తారింటికి దారేది, కాటమరాయుడు, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ చిత్రాలు 100 కోట్ల క్లబ్ లో చేరాయి. తాజాగా బ్రో సినిమా కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కాగా పవర్ స్టార్ నుంచి మరిన్ని భారీ చిత్రాలు రానున్నాయి. అందులో క్రిష్‌తో హరిహర వీరమల్లు, హరీశ్ శంకర్‌తో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ OG ఉన్నాయి. ఇందులో OG మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే పవర్ స్టార్ ఈ సినిమాలో గ్యాంగ్‌స్టార్‌గా కనిపించబోతున్నారు. ఇకపోతే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో OG నుంచి ఏదైనా అప్డేట్ ఉండొచ్చని ఫ్యాన్స్ ఆతురతగా ఎదురుచూస్తున్నారు. మరి వంద కోట్ల క్లబ్ లో పవన్ బ్రో సినిమా చేరడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.