చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణిచేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు ఓ శుభవార్త చెప్పింది.
చాలా మంది ప్రజలు.. తమ ప్రయాణానికి ఆర్టీసీ బస్సులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. సురక్షితంగా వెళ్తాయనే నమ్మకంతో ఎక్కువ మంది వాటిల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలానే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయాణికులకు అనేక రకాల సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అలానే ప్రత్యేక సందర్భాల్లో ప్రయాణికులకు ఆర్టీసీ సంస్థలు శుభవార్తలు చెప్తుంటాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కూడా ప్రయాణికులకు తీపి కబురు చెప్పింది. వేసవి నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలో ప్రయాణించే వారికి ఆర్ధికభారం తగ్గించేలా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
టీఎస్ ఆర్టీసీ ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో ప్రయాణికులకు పలు ఆపర్లు ప్రకటించే విషయం తెలిసిందే. గతంలో వుమెన్స్, డే, ఇండిపెండెంట్ డే వంటి ఇతర ప్రత్యేక సందర్భాల్లో పలు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తుంది. తాజాగా కూడా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. టి-24 టికెట్ ను భారీగా తగ్గించింది. గతంలో ఈ టికెట్ రూ.100 ఉండగా దానిని రూ.90 కి తగ్గించింది. అంతేకాక సీనియర్ సిటిజన్లకు అదే టి-24 టికెట్ లో రాయితీ కల్పించింది. వృద్ధులకు రూ.80కే టీ24 టికెట్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు.
60 ఏళ్ళు పైబడిన వారికి టి-24 టికెట్ లో 20 శాతం రాయితీ వర్తిస్తుంది. అయితే ఆ టికెట్ తీసుకునే సమయంలో అర్హత ధృవీకరణ పత్రాలు.. అంటే ఆధార్ కార్డును బస్ కండర్టర్లకు చూపించాల్సి ఉంటుంది. ఈ కొత్త టి-24 టికెట్ ధరలు గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. అలానే మహిళలు, సీనియర్ సిటినజ్లు కోసం టి-6 టికెట్ ను ఇటీవలే ప్రారంభించారు. రూ.50 టిక్కెట్టుతో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించ వచ్చు. అలానే కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సిటీలో టూర్ వేసే వారికి ఎఫ్-24 అనే ప్రత్యేక టికెట్ ను అందుబాటులోకి తెచ్చారు.
దీని ద్వారా రూ.300 చెల్లించి నలుగురు 24 గంటల పాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయామం చేయొచ్చుని సంస్థ ఛైర్మన్ బాజి రెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. అలానే విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న పుష్పక్ బస్సుల పాస్ ధరలు కూడా తగ్గించారు. రూ. 5 వేలు ఉన్న బస్సు పాస్ ను రూ.4 వేలుగా చేస్తున్నామన్నారు. మే 1 నుంచి తగ్గిన బస్సు పాస్ ధర అమలులోకి వస్తుందన్నారు. సమ్మర్ లో ప్రయాణికుల సౌకర్యార్థం టి-24 టికెట్ పై 10 శాతం రాయితీని సంస్థ కల్పిస్తోందని, అలానే సీనియర్ సిటిజన్లకు రూ. 80కే అందించాలని నిర్ణయించిందని అధికారులు తెలిపారు. టి-24 టికెట్‌కు మంచి స్పందన వస్తోందంట.
ప్రతి రోజు సగటున 25 వేల వరకు టికెట్లు అమ్ముడుపోతున్నాయని పేర్కొన్నారు. సిటీ పరిధిలో తిరిగే ఆర్డినరీ, మెట్రో బస్సుల్లోని కండక్టర్ల వద్ద ఈ టికెట్ అందుబాటులో ఉంటుందని, ప్రయాణికులందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని వారు కోరారు. గతంలో ఆ టికెట్ ధరను రూ.120గా ఉండగా ప్రయాణికుల ఆర్థిక భారం తగ్గించేందుకు 100కి తగ్గించారు. తాజాగా సాధారణ ప్రయాణికులకు టి-24 టికెట్ ధరను రూ.90కి, సీనియర్ సిటిజన్లకు రూ.80కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మరి.. టీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.