వీసీ సజ్జనార్ తెలంగాణ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో పథకాలు అమల్లోకి తీసుకు వచ్చారు. ఎప్పటికప్పుడు వినూత్న తరహాలు ప్రయాణీకు కోసం కొత్త స్కీమ్స్ తీసుకు వస్తూ తనదైన మార్క్ ని చూపిస్తున్నారు. ఒకదశలో నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తెలంగాణ లో ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి తర్వాత వినూత్నమైన స్కీమ్స్ అమలు చేస్తూ తనదైన మార్క్ పని తీరుతో ఆకట్టుకుంటున్నారు. నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నారు. తాజాగా ప్రయాణీకులు ఆయన రెండు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వివరాల్లోకి వెళితే.
గ్రేటర్ హైదరాబాద్ నగర ప్రజలకు, పర్యాటకులకు తెలంగాణ లో ఆర్టీసీ ఎండీ శుభవార్త చెప్పారు. ప్రయాణీకులకు మరింత చేరువ అయ్యేందుకు రెండు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రయాణీకులకు ఆర్థిక భారం తగ్గించేందుకు టి – 24 టికెట్ అందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టి-6, ఫ్యామిలీ -24 పేరు తో కొత్త టికెట్లను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఈ టికెట్లను ఈ నెల 10 శుక్రవారం నుంచి బస్ కండెక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని సజ్జనార్ తెలిపారు. మహిళలు, సినియర్ సిటిజన్లు కొరకు ఈ ప్రత్యేక ఆఫర్ తీసుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. కేవలం రూ.50 చెల్లించి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్డినరీ, మెట్రో బస్సులో ఆరు గంటల పాటు ఎక్కడికైనా ప్రయాణించవచ్చని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే టి-6 టికెట్ చెల్లుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ టికెట్స్ బస్సు లో కండెక్టర్లు ఇస్తారని.. మధ్యాహ్నం 2 గంటల తర్వాత టి-6 టికెట్లను ఇవ్వరని తెలిపారు. 60 ఏళ్లు పై బడిన వారికి టి-6 వర్తిస్తుందని సంస్థ తెలిపింది. వయసు ధృవీకరణ కోసం ఆధార్ కార్డు ని చూపించాల్సి ఉంటుందని తెలిపారు. ఇక వీక్ ఎండ్ కి కుటుంబ సభ్యులు, స్నేహితులో ప్రయాణించేందుకు వీలుగా ఫ్యామిలీ – 24 టికెట్ ని తీసుకు వచ్చామని.. ఈ టికెట్ రూ.300 చెల్లిస్తే.. నలుగురు ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించవచ్చని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. అయితే ఐదేళ్ల లోపు చిన్నారులకు ఈ ప్రయాణం ఉచితం.. అంతకు పైబడిన వారికి ఈ టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని.. శని, ఆదివారాల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందని స్పష్టం చేశారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో రెండు ప్రత్యేక ఆఫర్‌లను #TSRTC ప్రకటించింది. మహిళలు, సీనియర్ సిటిజన్ల కోసం టి-6ను, వారాంతాలు, సెలవుల్లో కుటుంబసభ్యులు, స్నేహితుల సౌకర్యార్థం ‘ఎఫ్-24’ టికెట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. టి-24 మాదిరిగానే ఈ టికెట్లను ఆదరించాలని #TSRTC యాజమాన్యం కోరుతోంది. pic.twitter.com/0qSvQ6mceF
— VC Sajjanar – MD TSRTC (@tsrtcmdoffice) March 9, 2023