'మా అబ్బాయి చాలా మంచోడు..ఎలాంటి దురలవాట్లు లేవు.. అతన్ని ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు..' అని ప్రవీణ్ తల్లిగారు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తారు. ఇక్కడ చూస్తే.. ఇతగాడి రాసలీల చిట్టా చాత్తాడంత ఉంది. ఈ కామాంధుడు దాహానికి ఎంత మంది ఆడపిల్లలు బలయ్యారో అంతుచిక్కడం లేదు. అతడి ఫోన్ లోని వందల సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాట్ లలో నగ్న వీడియోలు, ఫోటోలు చూసి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.
టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్ విషయంలో రోజుకో కొత్తకోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటికే ప్రవీణ్‌ను స్త్రీలోలుడిగా తేల్చిన పోలీసులు, అతడి రాసలీలల చిట్టాను బయటకు తెచ్చే పనిలో పడ్డారు. 2017లో టీఎస్‌పీఎస్‌సీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరిన ప్రవీణ్.. వెరిఫికేషన్ సెక్షన్‌కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు తీసుకునేవాడు. దరఖాస్తులోని సాంకేతిక సమస్యలను పరిష్కరించి వారితో సాన్నిహిత్యం పెంచుకుంటూ.. శారీరక సంబంధం పెట్టుకునేవాడు. అంతేకాదు.. ప్రవీణ్ ఏకంగా 46 మంది మహిళలతో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. వీరికి కూడా పేపర్ లీక్ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
‘మా అబ్బాయి చాలా మంచోడు..ఎలాంటి దురలవాట్లు లేవు.. అతన్ని ఎవరో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు..’ అని ప్రవీణ్ తల్లిగారు ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. అది విన్నాక అంత అమాయకుడా! అనిపించక మానదు. కానీ, ఇక్కడ చూస్తే.. ఈ కామాంధుడు దాహానికి ఎంత మంది ఆడపిల్లలు బలయ్యారో అంతుచిక్కడం లేదు. అతడి ఫోన్ లోని వందల సంఖ్యలో మహిళల ఫోన్ నంబర్లు, వాట్సాప్ చాట్ లలో నగ్న వీడియోలు, ఫోటోలు చూసి పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ కేసు దర్యాఫ్తు సిట్ చేతికొచ్చాక విచారణ వేగవంతం అయ్యింది. అమ్మాయిలతో ప్రవీణ్ న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 46 మంది మహిళలతో సంభాషించినట్లు గుర్తించారు. వీరికి కూడా పేపర్ లీక్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు.ప్రతిఫలం లేకుండా ఇంతమందితో ఇదెలా సాధ్యమవుతుందని వారిలో వారు ప్రశ్నించుకుంటున్నారు.
విచారించే కొద్దీ ప్రవీణ్ గంటకో కొత్త విషయం చెప్తున్నాడు. కాల్సే.. ఇన్నుంటే ఇతగాడు రూములకు వెళ్లిన లెక్కలు, ఎంతమందితో కలిశాడన్న లెక్కలు ఊహకు అందట్లేదు. ఈ లిష్టంతా బయటకు తీస్తే.. ఆ ఆడపిల్లల జీవితం ఏమవుతుందో అన్నది మరో అంతుచిక్కని ప్రశ్న. మరోవైపు ఈ పేపర్ లీక్ కేసులో ప్రవీణ్‌తో పాటు పాలుపంచుకున్న రేణుక సెలవుల విషయంలోనూ ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. వనపర్తి మండలం బుద్ధారం ఎస్‌సీ గురుకుల పాఠశాలలో హిందీ టీచర్‌గా వ్యవహరిస్తున్న రేణుక, ఈ ఏడాదిలో 12 సెలవులు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 4 , 5 తేదీల్లో తమ బంధువు మృతిచెందాడని ఆమె సెలవు పెట్టింది. ఆ తేదీల్లోనే పేపర్ లీక్ జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన ప్రతి పరీక్ష ముందు సెలవులు రేణుక సెలవలు పెట్టినట్లు పోలీసులు తేల్చారు.
కాగా, ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) ప్రశ్నపత్రం లీకయినట్లు నిర్ధారణ కావడంతో, ఆ పరీక్షను టీఎస్‌పీఎస్‌సీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది. ఈ మేరకు బుధవారం రాత్రి కమిషన్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. 837 అసిస్టెంట్ ఇంజనీర్స్, టెక్నికల్ ఆఫీసర్స్, జూనియర్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 5న ఏఈ పరీక్ష నిర్వహించారు. కాగా, ఈ పోస్టుల కోసం మొత్తం 74,478 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, పేపర్-1కు 55,189 మంది, పేపర్-2కు 54,917 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారేలా కనిపిస్తోంది. ప్రవీణ్ రాసలీలల చిట్టాపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.