ఔను.. వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకుని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఎంతో సంతోషంగా సాగుతున్న వీరి సంసారాన్ని చూడలేక విధి వెక్కిరించింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని బాసలు చేసుకున్నారు. కొంత కాలం తర్వాత వీరి ప్రేమకు ప్రతీ రూపంగా ఇద్దరు పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ దంపతులు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. కానీ, వీరి సంతోషాన్ని విధి చూడలేక వెక్కిరించింది. అసలేం జరిగిందంటే?
హైదరాబాద్ బోరబండ పరిధిలోని కార్మికనగర్ లో భరత్, మమత దంపతులు నివాసం ఉంటున్నారు. వీళ్లు చాలా ఏళ్ల కిందటే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు. భరత్ నగరంలోని బీహెచ్ఈఎల్ లో ఆర్టీసీ డిపోలో పనిచేస్తుండేవాడు. అయితే ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా ఈ దంపతుల కాపురం సజావుగానే సాగుతూ వచ్చింది. ఈ క్రమంలోనే గత 28 రోజుల కిందట భరత్ భార్య మమత రోడ్డు ప్రమాదానికి గురై అక్కడికక్కడే మరణించింది. దీంతో అప్పటి నుంచి భర్త భరత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
భరత్ తరుచు భార్య గురించే ఆలోచిస్తూ మనోవేదనకు గురయ్యేవాడు. మమత నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నా. పిల్లలను అన్నయ్య, అక్క బాగా చూసుకుంటారు అంటూ భరత్ సూసైడ్ నోట్ రాసి ఇటీవల ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంలో తల్లి, ఆత్మహత్య చేసుకుని తండ్రి.. ఇలా ఇద్దరూ చనిపోవడంతో పిల్లలు తల్లిదండ్రులు లేని ఆనాథలయ్యారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.