ఓ అన్న తన ఒక్కగానొక్క చెల్లి పెళ్లిని ఘనంగా చేయాలని ఎన్నో కలలు కన్నాడు. ఇందు కోసం ఓ వ్యక్తిని చూసి ఇటీవల పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఇక పెళ్లి రోజు కూడా రానే వచ్చింది. కట్ చేస్తే.. చెల్లి రోజే ఆ అన్న మృతి చెందాడు. అసలేం జరిగిందంటే?
తన చెల్లి పెళ్లి ఘనంగా చేయాలని ఆ అన్న ఎప్పటి నుంచో కలలు కన్నాడు. ఇటీవల ఓ మంచి సంబంధాన్ని చూసి పెళ్లికి నిశ్చితార్థం కూడా జరిపించారు. ఇక చెల్లి పెళ్లి సమయం దగ్గరపడుతుండడంతో కశ్మీర్ లో సీఆర్‌ఫీఎఫ్ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్న అన్న.. సెలవులు పెట్టి ఈ మధ్యే ఇంటికొచ్చాడు. దగ్గరుండి తానే పెళ్లి పనులన్నీ చూసుకుంటున్నాడు. కట్ చేస్తే.. చెల్లి పెళ్లి రోజే ఆ అన్న మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
అది రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామం. ఇక్కేడ సత్తయ్య, సత్తమ్మ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం. పెద్ద కమారుడు శ్రీనివాస్ సీఆర్‌ఫీఎఫ్ జవాన్ గా పని చేస్తుండగా, చిన్న కుమారుడు, కూతురు ఇంటి వద్దే ఉంటున్నారు. అయితే చెల్లి పెళ్లి చేయాలని శ్రీనివాస్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. ఇందు కోసం ఇటీవల పరిగికి చెందిన ఓ వ్యక్తితో మార్చి 1న పెళ్లికి నిశ్చితార్థం పెట్టుకున్నారు. అయితే చెల్లి పెళ్లికి సమయం దగ్గరపడుతుండడంతో కశ్మీర్ లో జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఈ మధ్యే సెలవులు పెట్టి ఇంటికి వచ్చాడు.
ఇక మార్చి 1న పెళ్లి కావడంతో శ్రీనివాస్ దగ్గరుండి తానే పెళ్లి పనులు అన్నీ చూసుకున్నాడు. ఇకపోతే ఇటీవల పెళ్లి కార్డ్స్ పంచడానికి వెళ్లిన శ్రీనివాస్ ఈ నెల 21న ఫరూక్ నగర్ లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే స్పందించిన శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అతడిని నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, వధువు సోదరుడు ఆస్పత్రికి చికిత్స పొందుతుండడంతో శ్రీనివాస్ తల్లిదండ్రులకు ఏం చేయాలో తోచలేదు.
ఇక చేసేదేంలేక పెళ్లి వధువు ఇంటి వద్దే జరిపించాలని నిర్ణయించారు. దీనికి వరుడు కుటుంబ సభ్యులు సైతం అంగీకరించారు. మార్చి 1న పెళ్లి జరిగిన కొద్దిసేపటికే.. శ్రీనివాస్ చికిత్స పొందుతూ చెల్లి పెళ్లి రోజే ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆ యువకుడు మరణించడంతో పెళ్లింట తీవ్ర నిండింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో శ్రీనివాస్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చెల్లి పెళ్లి రోజే మృతి చెందిన శ్రీనివాస్ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.