రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతున్నారు నేటి కుర్రకారు. వాహనం చేతికొస్తే చాలు.. బ్రేకుల్లేని వారి మనస్సుల్లాగే.. వారూ ప్రవర్తిస్తున్నారు. డ్రైవింగ్ సరిగ్గా రాని యువకులు కూడా ఇష్టానుసారంగా బండ్లను నడుపుతూ..మృత్యువాత పడుతున్నారు. మరి కొంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమౌతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతున్నారు నేటి కుర్రకారు. వాహనం చేతికొస్తే చాలు.. బ్రేకుల్లేని వారి మనస్సుల్లాగే.. వారూ ప్రవర్తిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసు చూస్తే మాకేంటీ.. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగేదేంటీ అని ఉడుకు రక్తంతో ఉరకలు వేస్తున్నారు. ఇక నిషిద్దమైనా మైనర్లకు కూడా బండ్లు అప్పజెబుతున్నారు తల్లిదండ్రులు. డ్రైవింగ్ సరిగ్గా రాని యువకులు కూడా ఇష్టానుసారంగా బండ్లను నడుపుతూ..మృత్యువాత పడుతున్నారు. మరి కొంత మంది ప్రాణాలు పోయేందుకు కారణమౌతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం ఖానాపూర్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు విద్యార్థులు దుర్మరణం చెందారు. వీరిలో మైనర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
శంకర్ పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగి ఉన్న లారీని వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు మరణించారు. మరొకరు చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ ఘటన సీబీఐటికి సమీపంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. కారులో నుండి క్షతగాత్రులను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగే సమయానికి కారులో 12 మంది ఉన్నట్లు గుర్తించారు. గాయపడినవారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. బాధితులంతా నిజాంపేటకు చెందినవారిగా గుర్తించారు. అందిన సమాచారం ప్రకారం.. నిజాంపేటకు చెందిన యువతికి వివాహం కుదిరింది.
బ్యాచ్‌లర్ పార్టీలో భాగంగా కొంత మంది స్నేహితులు కారులో నార్సింగ్ సీబీఐటీ నుండి ఓషన్ పార్కుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా.. వాహనం అదుపు తప్పి.. పోచమ్మ గుడి వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జు నుజ్జయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా.. ఆసుపత్రిలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మృతులను అంకిత, అర్షిత, అమృత, నితిన్‌లుగా గుర్తించారు. వీరిలో మైనర్లు ఉన్నట్లు సమాచారం. ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.