కనిపెంచిన తల్లిదండ్రుల ముందే తమ పిల్లలు చనిపోతే ఆ బాధ తట్టుకోలేనిది. కానీ, అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. తల్లి కళ్లముందే కూతురు ప్రాణాలు విడిచింది. అసలేం జరిగిందంటే?
కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తల్లి కళ్లెదుటే ఆమె కూతురు ప్రాణాలు విడిచింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? జిల్లాలోని పుల్కల్ గ్రామంలో శిరీష అనే బాలిక తల్లిదండ్రులతో పాటు నివాసం ఉండేది. ప్రస్తుతం ఆ బాలిక పదవ తరగతి కావడంతో పరీక్షలు రాస్తూ వచ్చింది. అయితే శిరీష ఎప్పటిలాగే సోమవారం కూడా పరీక్షకు వెళ్లింది. ఇక పరీక్ష అనంతరం ఆ బాలిక తల్లితో పాటు ఇంటికి వెళ్లేందుకు ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లగానే ఆ ఆటో ప్రమాదవశాత్తు బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో శిరీష అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తల్లి తీవ్రగాయాలతో ప్రాణాలతో బయటపడింది. అయితే తల్లి కళ్లముందే కూతురు చనిపోవడంతో తల్లి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఈ విషయం తెలుసుకున్న శిరీష కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మొన్నటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న శిరీష.. ఉన్నట్టుండి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మరణించిన శిరీష మృతిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.