ఈ యువతి పేరు సురేఖ, వయసు 24 ఏళ్లు. 2021లో ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు భర్త బాగానే ఉన్నాడు. కానీ, కొన్ని రోజులు గడిచిన తర్వాత అతడు రాక్షసుడిలా మారి దారుణానికి ఒడిగట్టాడు. అసలేం జరిగిందంటే?
ఆమెకు రెండేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొత్తలో భర్త భార్యతో సంతోషంగానే ఉన్నాడు. కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. అలా కొన్ని రోజులు గడిచిందో లేదో భర్త తన అసలు రూపాన్ని బయటపెట్టాడు. డబ్బు కోసం ఏకంగా నీఛానికి దిగి భార్య అని చూడకుండా దారుణంగా వ్యవహరించాడు. కట్ చేస్తే.. చివరికి భర్త టార్చర్ ను తట్టుకోలేక ఆ మహిళ సంచలన నిర్ణయం తీసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్ బసాపూర్. ఇదే గ్రామానికి చెందిన ఎర్రగుళ్ల ప్రవీణ్ కుమార్, హత్నూర మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన వనం సురేఖ (24) అనే యువతిని 2021లో వివాహం చేసుకున్నాడు. ఇక పెళ్లిలో భాగంగా సురేఖ తల్లిదండ్రులు అల్లుడికి దాదాపుగా రూ.13 లక్షల వరకు కట్నం ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. ఇక పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కొన్ని రోజులు గడిచిందో లేదో భర్త ప్రవీణ్ కుమార్ తన అసలు రూపాన్ని బయటపెట్టాడు.
అదనపు కట్నం తేవాలంటూ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. భర్త టార్చర్ ను భరించలేని సురేఖ గతంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు రక్షించారు. అలా కొన్ని రోజులు గడిచింది. అయినా తన బుద్ది మార్చుకోని భర్త.. డబ్బుకు ఆశపడి భార్యను తీవ్రంగా హింసించడం మొదలు పెట్టాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ భార్యతో గొడవకు దిగేవాడు. దీంతో సురేఖ తల్లిదండ్రులు పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించి మళ్లీ కొంత డబ్బును ముట్టజెప్పారు.
ఇంతటితోనైనా భర్త ప్రవీణ్ మారతాడని అందరూ ఆశించారు. కానీ, అవేం జరగలేదు. ఇక అతడు మళ్లీ అలాగే ప్రవర్తిస్తూ సురేఖను అదనపు కట్నం తేవాలంటూ మళ్లీ వేధించసాగాడు. ఇక తట్టుకోలేకపోయిన సురేఖ.. ఇటీవల శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.