హైదరాబాద్ నగరంలో ఏటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతి రోజు వందలాది వాహనాలు రోడ్డు మీదకు వస్తున్నాయి. దీంతో వాహనాల స్థాయిలోనే ట్రాఫిక్ సమస్య కూడా పెరిగిపోతుంది. ఈ ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు, వాహనదారులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు ఎవరికి వారులు తమకేమి సంబంధంలేదు అన్నట్లు అందులోనే ఉంటారు. ఎవరూ వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేయరు. తాజాగా జూబ్లీహిల్స్ లోని ఫిల్మ్ నగర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. ఇదే సమయంలో అటువైపు వెళ్తున్న ప్రముఖ సినీ నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు కారులో నుంచి కిందకు దిగి ట్రాఫిక్ ను నియంత్రించారు. వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తెలుగు అగ్ర నిర్మాతల్లో ఒకరిగా ఆయన కొనసాగుతున్నారు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలను ఆయన బ్యానర్ లో తెరకెక్కించారు. అలానే సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాలను కూడా తెరకెక్కించారు. సోదరుడు విక్టరీ వెంకటేష్, కుమారుడు రానా టాలీవుడ్ లో స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. అలా తెలుగు చిత్ర పరిశ్రమలోనే టాప్ ప్రొడ్యూసర్ గా ఉన్న సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. హైదరాబాద్ లోని జూబ్లిహిల్స్ ప్రాంతంలోని ఫిల్మింనగర్ సమీపంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో అటుగా నిర్మాత సురేష్ బాబు వెళ్తున్నారు. ఆయన కారులో నుంచి దిగి తానే స్వయంగా ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. చాలా సమయం పాటు వాహనదారులకు సూచనలు చేస్తూ వాహనాలను ముందుకు పంపారు.
అలా కొంత సమయం పాటు వాహనదారులకు సూచనలు చేస్తూ ట్రాఫిక్ ను నియంత్రించారు. ఓ ప్రముఖ నిర్మాత ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉండటం వాహనాదారులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో అక్కడే ఉన్న కొందరు సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సన్నివేశాలను వీడియో తీశారు. ప్రస్తుతం సురేష్ బాబు ట్రాఫిక్ క్లియర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు సురేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బాధ్యతగల పౌరుడిగా వ్యవహరించారని ప్రశంసిస్తున్నారు. ఇలా ప్రముఖులు స్వయంగా రంగంలోకి దిగి సమాజంలో ఎదురయ్యే సమస్యలో పాల్గొని పరిష్కరిస్తుంటే.. నలుగురికి స్ఫూర్తిగా ఉంటుందని మరికొందరు కామెంట్స్ చేశారు. మరి.. నిర్మాత సురేష్ బాబు.. తానే స్వయంగా ట్రాఫిక్ ను క్లియర్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.