విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. కుటుంబంలో విషాదాన్ని నింపేసి వెళ్లిపోయారు. అనుకోని ఘటన కారణంగా మృత్యువు ఒడిలో చేరిపోయారు.
విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. అన్నకు ఆపద వచ్చిందని సోదరులిద్దరూ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అన్నదమ్ములు ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మొదట అన్నకు ప్రమాదం వచ్చిందని చివరి వాడు వెళ్ళాడు. ఇద్దరినీ కాపాడదామని మధ్యలో సోదరుడు వెళ్ళాడు. అయితే ఎవరూ ఎవరినీ కాపాడుకోలేకపోయారు. మృత్యువు ముందు ముగ్గురూ ఓడిపోయారు. మృత్యువుతో పోరాడి అదే మృత్యువు ఒడిలో చేరిపోయారు. దీంతో స్థానికంగా విషాదం నెలకొంది. చెట్టంత కొడుకులు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో పారామౌంట్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది.
ఇంట్లో నీటి సంపును శుభ్రం చేస్తుండగా విద్యుదాఘాతంతో ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందారు. రజాక్ (18) అనే యువకుడు ఇంట్లో ఉన్న నీటి సంపును శుభ్రం చేసేందుకు అందులోకి దిగాడు. ఆ తర్వాత మోటార్ ఆఫ్ చేసే క్రమంలో అతనికి కరెంట్ షాక్ తగిలింది. ఆ విషయం తెలియని తన ఇద్దరు సోదరులు అన్నస్ (19), రిజ్వాన్ (16) రజాక్ ను కాపాడేందుకు ప్రయత్నించగా వీరికి కూడా కరెంట్ షాక్ తగిలింది. దీంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. తమ కొడుకులను ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులకు ప్రాణం పోయినట్టయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.