పెళ్లి అనేది ఇద్దరు మనుషులను.. మనసులను ఒక్కటి చేసేది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతి అంటారు. ఎవరి ఆచారాల ప్రకారం వారు పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు.
పెళ్లి అంటే నూరేళ్ల పంట.. ఎవరి ఆచారాల ప్రకారం వారు పెద్దల సమక్షంలో వారి ఆశీస్సులతో ఒక్కటవుతారు. పెళ్లి అనేది ఇద్దరు మనుషులను.. మనసులను ఒక్కటి చేసేది. జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే మధురానుభూతి అంటారు. ఇటీవల వివాహాలు తమ స్థాయికి తగ్గట్లు రక రకాల పద్దతుల్లో చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లి అంటే కనీసం ఐదు రోజుల పండుగ అంటుండేవారు.. కానీ ఇటీవల కాలంలో పెళ్లి కార్యక్రమాలు ఒక్క రోజులో ముగిస్తున్నారు. హైదరాబాద్ చాంద్రాయణగుట్లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. పెళ్లి కానుగా తనకు పాత మంచం ఇచ్చారని పెళ్లికి వరుడు డుమ్మాకొట్టాడు. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్.. మౌలాలీలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్న మహ్మద్ జకారియా కు బండ్ల గూడకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయం అయ్యింది. ఈ నెల 13న బండ్లగూడలో వధువు ఇంటి వద్ద ఇరువురు బంధు, మిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ అయ్యింది. ఆదివారం మధ్యాహ్నం బండ్లగూడలో ఓ మసీదులో పెళ్లి జరగాల్సి ఉంది. సాంప్రదాయం ప్రకారం శనివారం వరుడి ఇంటికి కొంత ఫర్నీచర్ పంపించారు వధువు తల్లిదండ్రులు. అందులో ఒక మంచం కూడా ఉంది. అయితే మంచం విడిభాగాలను జోడిస్తుండగా విరిగిపోయింది. దాంతో వరుడి తల్లిదండ్రులు షాక్ తిన్నారు.. పాత మంచానికి రంగులు వేసి కొత్తమంచం అని చెప్పి తమను మోసం చేశారని పెళ్లి కొడుకు జకారియా అత్తంటివారిపై కోపం పెంచుకున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం జరగాల్సిన పెళ్లికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయాడు.
ఇక అదివారం వధువు తల్లిదండ్రులు మసీద్ లో నిఖా కోసం అన్ని ఏర్పాటు చేశారు. పెళ్లి కూతురి కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లి కొడుకు కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతసేపటికి వరుడు జకారియా రాకపోయేసరికి అనుమానం వచ్చిన వధువు తండ్రి వరుడి ఇంటికి వెళ్లాడు. అందరూ ఎదురు చూస్తున్నారని.. పెళ్లికి ఎందుకు రాలేదని ప్రశ్నించాడు. దీంతో తనను మోసం చేశారని.. పాత మంచానికి రంగులు వేసి పంపారని… దాన్ని జోడిస్తుంటే విరిగిపోయిందని వధువు తండ్రితో వాగ్వాదానికి దిగాడు. అదే సమయంలో వరుడి తల్లి రహమతున్నిసాబేగం సైతం వధువు తండ్రిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను పెళ్లికి రాను ఏం చేసుకుంటారో చేసుకో అని సమాధానం చెప్పాడు జకారియా.
ఈ క్రమంలో జకారితో పాటు అతని తల్లి రహమతున్నిసా బేగం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు వధువు తండ్రి. పోలీసులు వరుడికి ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడంతో పెళ్లికి సిద్దమే అన్నాడు. కానీ వధువు తండ్రి పెళ్లికి నిరాకరించడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మొత్తానికి కొద్ది సేపట్లో పెళ్లి జరగబోతుందన్న ఆనందంలో మంచం పెట్టిన చిచ్చుతో అర్ధాంతరంగా ఆగిపోయింది.