బాజాభజంత్రీల శబ్ధాలతో మండపం అంతా సందడిగా మారింది. ఇక వరుడు వధువు మెడలో తాళికట్టే సమయానికి సినిమా స్టైల్ లో.. ఆగండి అంటూ పోలీసులు మండపంలోకి అడుగు పెట్టి అందరూ చూస్తుండగానే వరుడు తండ్రిని అరెస్ట్ చేశారు. ఈ సీన్ చూసి అంతా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పెళ్లి మండలంలో ఓ వివాహం జరుగుతుంది. ఈ పెళ్లికి వరుడు, వధువు బంధువులు అందరూ హాజరయ్యారు. బాజాభజంత్రీల శబ్ధాలతో మండపం అంతా సందడిగా మారింది. ఇక వరుడు వధువు మెడలో తాళికట్టే సమయానికి సినిమా స్టైల్ లో.. ఆగండి అంటూ పోలీసులు మండపంలోకి అడుగు పెట్టారు. ఈ సీన్ చూసి అందరూ షాక్ గురయ్యారు. ఇక అందరూ చూస్తుండగానే పోలీసులు వరుడు తండ్రిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వరుడు తండ్రిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ ఘటనలో అసలేం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.
మేడ్చల్ జిల్లాలోని జవహార్ నగర్ ప్రాంతంలో ఎరుకల శ్రీను అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు గత 3 ఏళ్ల కిందట మేడ్చల్ జిల్లా జాతీయ రహదారి పక్కనున్న ఓ వేంచర్ లోని భూమి విషయంలో ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇదిలా ఉంటే గురువారం శ్రీను కుమారుడి వివాహం నాగోల్ లోని ఓ ఫంక్షన్ హాలులో జరుగుతుంది. అతని కుమారుడి వివాహానికి బంధువులు అంతా హాజరయ్యారు. బాజాభజంత్రీల శబ్ధాలతో మండపం అంతా సందడిగా మారింది.
ఇక తాళికట్టే సమయానికి పెళ్లి మండపంలోకి పోలీసులు అడుగు పెట్టారు. ఇక్కడ పోలీసులు ఏంటని బంధువులు అంతా ఆశ్చర్యపోయారు. ఇక వస్తూ వస్తూనే పోలీసులు వరుడు తండ్రి శ్రీను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఇతను ఓ భూ వివాదంలో ఇరుక్కున్నాడని, అందుకే శ్రీనివాస్ ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు తెలినట్లు సమాచారం. అయితే శ్రీనివాసు కుటుంబ సభ్యులు మాత్రం.. ఇందులో రాజకీయ నాయలకుల పాత్ర ఉందని వాపోతున్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.