టీవీ సింగింగ్ రియాలిటీ షోలలో ఇండియన్ ఐడల్ కు ప్రత్యేకస్థానం ఉంది. పేరుకి హిందిషో అయినా అక్కడ మన తెలుగుదనం పరిమళిస్తూనే ఉంటుంది. ఇండియన్ ఐడల్ 12 టీవీ షోల హిస్టరీలోనే అతి పెద్ద గ్రాండ్ గ్రాండ్ ఫినాలేగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇండియన్ ఐడల్ ఫైనలిస్ట్, తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ మంచి క్రేజీ ఆఫర్ కొట్టేసింది. అది కూడా మన రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నుంచి.
తన అద్భుత ప్రదర్శనాతో ఫైనల్ చేరిన షణ్ముఖకు ఫినాలేలో మన విజయ్ దేవరకొండ మంచి కిక్కిచ్చే సర్ప్రైస్ ఇచ్చాడు. షణ్ముఖకు అల్ ది బెస్ట్ చెప్తూ విజయ్ వీడియో చేసాడు. ‘హే షణ్ముఖ ప్రియ ఎట్లున్నావ్. ఇండియన్ ఐడల్ ఫినాలెకు నా బెస్ట్ విషెస్ అంటూ విజయ్ షణ్ముఖకు షాక్ ఇచ్చాడు. ఆంటీ నమస్తే.. షణ్ముఖ పాడేటప్పుడు మీరు పక్కన లిప్ సింక్ ఇస్తారు అది నాకు బాగా నచ్చుతుంది. షణ్ముఖ నెవెర్ లూస్ అంటూ ధైర్యం చెప్పిన విజయ్… ఫినాలే తర్వాత నువ్వు హైదరాబాద్ వస్తున్నావ్, నా మూవీలో పాడుతున్నావ్.. ఇట్స్ ఏ డీల్ అంటూ విజయ్ దేవరకొండ పెద్ద ఆఫర్ ఇచ్చేసాడు.
విజయ్ ఆఫర్ కు షణ్ముఖ ప్రియనే కాదు అక్కడున్న సెలెబ్రిటీలు, జడ్జెస్ అందరూ షాక్ అయ్యారు. విజయ్ ఆఫర్ గురించి ఎలా ఫీల్ అవుతున్నావ్ అని షణ్ముఖను అడగగా… ‘విజయ్ సర్ థాంక్యూ సోమచ్, నేను ఎప్పుడు అనుకోలేదు మీరు నన్ను చూస్తారు అని, నాకు సపోర్ట్ చేస్తారు అని. థాంక్యూ సో మచ్ సర్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అంటూ ఎగిరి గంతేసింది. షణ్ముఖ ప్రియా తల్లిదండ్రులు ఐతే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బు అయిపోయారు.
టీవీ షోలలో ఇప్పటివరకు ప్రసారం కానంత లాంగెస్ట్ ఫినాలేగా ఇండియన్ ఐడల్ 12 ఉండబోతోంది. 12 గంటలపాటు ఇండియన్ ఐడల్ 12 గ్రాండ్ ఫినాలే ప్రసారం కానుంది. తెలుగునాట కూడా ఇండియన్ ఐడల్ టీవీ షోకి మంచి ఆదరణే ఉంది. టాప్ 6 ఫైనలిస్ట్స్ షణ్ముఖ ప్రియ, పవన్ దీప్, అరుణిత కంజిలాల్, ధనిష్, సైలి కాంబ్లేలో ఎవరు ఇండియన్ ఐడల్ కాబోతున్నారని ప్రశ్నర్ధ్కంగానే ఉంది. తుదిసమరంలో మన తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ ఉండటం, మన ప్రేక్షకులకు మరింత కిక్ ఇచ్చే అంశమే అవుతుంది.