బుల్లితెరపై వచ్చిన జబర్ధస్త్ కామెడీ షోతో తన అందచందాలు, అద్భుతమైన యాంకరింగ్ తో ప్రేక్షకుల మనసు దోచింది అనసూయ. ఆ తర్వాత వెండితెరపై వరుస ఛాన్సులు దక్కించుకుంటూ బిజీగా మారింది.
తెలుగు బుల్లితెరపై వచ్చిన ‘జబర్ధస్త్ కామెడీ షో’ తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది యాంకర్ అనసూయ. బుల్లితెరపై ఎన్నో ప్రోగ్రామ్స్ లో చేసిన అనసూయ ఇండస్ట్రీవైపు దృష్టి సారించింది. వరుస సినిమా ఛాన్సులు రావడంతో ప్రస్తుతం వెండితెరపై ఎక్కువగా ఫోకస్ పెడుతుంది. రంగస్థలం, పుష్ప మూవీస్ తో అనసూయకు మంచి పేరు వచ్చింది. పాజిటీవ్, నెగిటీవ్ ఎలాంటి పాత్రల్లో అయినా తనదైన మార్క్ చూపిస్తుంది. అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. తరచూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. ఈ మద్య విజయ్ దేవరకొండ విషయంలో వస్తున్న ట్రోల్స్, రూమర్స్ పై తనదైన స్టైల్లో ఘాటుగా స్పందించింది. వివరాల్లోకి వెళితే..
గత కొంత కాలంగా మీడియాలో అనసూయ వర్సెస్ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి మధ్య జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటికప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కౌంటర్లు వేస్తూ వస్తుంది యాంకర్ అనసూయ. ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి మూవీలో నటినటిస్తున్నాడు. ఈ మూవీలో విజయ్ దేవరకొండ కు జంటగా సమంత నటిస్తుంది. ఈ మూవీ పోస్టర్ లో విజయ్ దేవరకొండకు పేరు పై ‘ది’(The) అని పెట్టడంపై అనసూయ బాబోయ్ పైత్యం.. ఏం చేస్తాం.. అంటకుండా చూసుకుందాం.. అంటూ ఇన్ డైరెక్ట్ గా సెటైర్స్ వేసింది. దీంతో ఆమెపై విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అనసూయ ఆంటీ అంటూ ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. ఈ విషయంలో అనసూయ కూడా తగ్గేదే లే అంటూ కౌంటర్స్ ఇస్తూ వచ్చింది.
విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వర్సెస్ అనసూయ మద్య జరుగుతన్న ట్వీట్స్ వార్ నేపథ్యంలో ఆమె ఒక వీడియో బైట్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు.. అన్నవాడి నోరే కంపు.. సెలబ్రెటీల మీద వార్తలు రాస్తూ కడుపు నింపుకునే మీరు.. ధైర్యం ఉంటే.. ఉప్పు కారం తింటుంటే అసలు వాస్తవాలు రాయండి. నేను ఇప్పుడు మీ ముందు నిజం మాట్లాడాను.. నా అభిప్రాయం తెలియజేశాను’ అంటూ వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అనసూయ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంది. మరి దీనిపై వీజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మళ్లీ ఏ రేంజ్ లో స్పందిస్తారో చూడాలి.