దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం సృష్టిస్తుంది. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఈ కేసులు బయట పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో రెండు ఒమిక్రాన్ కేసులు బయట పడటంతో ఒక్కసారే ఉలిక్కి పడింది. తెలంగాణలో ఇద్దరు ఒమిక్రాన్ కేసుల బాధితులు ఉన్నారని రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు హైదరాబాద్‌లో మీడియా సమావేశం నిర్వహించి పలు వివరాలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్‌పై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని అన్నారు. తొలిసారిగా రెండు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటన చేశారు.
హైదరాబాద్‌లోని టోలీచౌకిలో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని ఆయన తెలిపారు. కెన్యాకు చెందిన 24 ఏళ్ల యువతి ఈ నెల 12న రాష్ట్రానికి వచ్చిందని, ఆమెకు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిందని ఆయన వివరించారు. బాధితులను టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నాం అన్నారు. వీరితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తిస్తున్నామన్నారు. అయితో మరో బాలుడికి కూడా శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఒమిక్రాన్ పాజిటివ్ నిర్ధారణ అయ్యిందన్నారు. అయితే ఆ అబ్బాయి ఎయిర్ పోర్టు నుంచి పశ్చిమ బెంగాల్ వెళ్లిపోయాడని తెలిపారు. తెలంగాణలో ఒమిక్రాన్ ఎంట్రీతో డీహెచ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల్లో ఈ కేసులు డబుల్ అవుతాయన్నారు హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ రావు.
ఇదీ చదవండి : దేశంలో క్రమంగా తగ్గుతున్నకోవిడ్ కేసులు!
ఒమిక్రాన్ సోకిన వారిలో లక్షణాలు స్వల్పంగా కనపడుతున్నాయని ఆయన అన్నారు. తలనొప్పి, నీరసం, జలుబు, దగ్గు వంటివి ఉంటున్నాయని వివరించారు. లక్షణాలు ఉన్న ప్రతీ ఒకరు టెస్ట్ చేయించుకోవాలనుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఇద్దరు ఒమిక్రాన్ బాధితులు మాత్రమే ఉన్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం 77 దేశాల్లో ఒమిక్రాన్ ఉందన్నారు. ప్రజలు అజాగ్రత్తతో వ్యవహరిస్తే వారి కుటుంబ సభ్యులు కూడా ఒమిక్రాన్ బారినపడే అవకాశం ఉంటుందని చెప్పారు. తప్పకుండా మాస్కు పెట్టుకోవాల్సిందేనని సూచించారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి చర్యలు తీసుకుంటే వ్యాప్తిని తగ్గించవచ్చని చెప్పారు. ఇక ష్ట్రంలో రెండు ఒమిక్రాన్ కేసులు వచ్చిన నేపథ్యంలో తాము మరింత అప్రమత్తమయ్యామని చెప్పారు.