గత కొన్ని రోజులుగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లో కలవరం రేపుతోంది. కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గుముఖం పడుతున్నాయి అనుకున్న లోపే ఇప్పుడు మళ్లీ విజృంభన కొనసాగిస్తుంది. గత వారం వరకు పదివేల లోపు ఉన్న కేసులు ఒక్కసారిగే పెరిగాయి. నిన్నటి వరకు 13 వేల వరకు నమోదైన కేసులు నేడు అనుహ్యంగా 16,764 కేసులు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటల్లో 220 మంది కరోనా బారినపడి మృతి చెందారు. దీనితో పాటు తాజాగా 7,585 మంది కరోనా నుంచి కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా నేపథ్యంలో ఇప్పటికే పలు రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను తీవ్రతరం చేశారు. మొత్తం కేసులు 3,48,38,804 కు చేరాయి. ఇందులో 3,42,66,363 మంది కరోనా నుంచి కోలుకోగా, 4,81,080 మంది మృతి చెందారు.
ఇది చదవండి : ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన.. 4 జిల్లాలకు అలర్ట్
ప్రస్తుతం 91,361 కేసులు యాక్టీవ్ గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు 7585 కోలుకున్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు 23 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో తాజాగా 1270 కి ఒమిక్రాన్ కేసులు పెరిగాయి. 374 మంది బాధితులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
#Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant
𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/K6pcds2cbU pic.twitter.com/jKZoCZH7eo
— Ministry of Health (@MoHFW_INDIA) December 31, 2021