ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపిన విషయం తెలిసిందే. తాజాగా పాన్ ఇండియా మూవీ కేజీఎఫ్ -2 పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్ 2’ మూవీ గుడ్ న్యూస్ చెప్పింది. ‘కేజీఎఫ్ 2’మూవీ కొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకొవచ్చు అని అనిమతి ఇస్తూ జీవో కూడా జారీ చేసింది. నాలుగు రోజుల వరకు ఈ ధరలు పెంచుకోవచ్చు అని తెలిపింది. కాకపోతే ఈ రేట్లు మల్టీప్లెక్స్ స్క్రీన్లు , ఐమాక్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఉండగా.. నాన్ ఏసీ థియేటర్లలో ఎటువంటి మార్పులూ లేవు. అంతేకాదు రోజుల పాటు ఐదు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే పెరిగిన రేట్ల ప్రకారం మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ. 350, సింగిల్ స్కీన్స్‌లో రూ. 200వరకు ఉండవొచ్చని భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే కేజీఎఫ్ 2 మూవీ తెలుగు రాష్ట్రాల్లో కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రశాంత్ నిల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి నటించింది. ఈ మూవీపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. కేజీఎఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కనీవినీ ఎరగని బిజనెస్ చేసినట్లు సమాచారం.