ఏళ్లుగా ఉద్యోగ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్ప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కానిస్టేబుళ్లు, SI పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,027 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2 నుంచి అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నామని.. మే 20 చివరి తేదీగా ప్రకటించారు. అభ్యర్థులు www.tslprb.in లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మహిళలకు పలు పోస్టుల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు తెలిపారు.
పోస్టుల వివరాలు..
సివిల్ కానిస్టేబుళ్లు -4,965
ఏఆర్ కానిస్టేబుళ్లు -4,423
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ -5,010
స్పెషల్ ఫోర్స్ – 390
ఫైర్ – 610
డ్రైవర్స్ – 100
SI పోస్టులు – 414
ఉద్యోగ ప్రకటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.