ఒక పక్క లేఆఫ్స్ పేరుతో వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూ పెద్ద పెద్ద కంపెనీలు షాకిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు ఊడిపోగలవు జాగ్రత్త అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఎందుకంటే?
ఒక పక్క మెటా, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఉద్యోగాలు పోగలవు జాగ్రత్త అంటూ ప్రభుత్వ ఉద్యోగులను హెచ్చరించింది. ప్రైవేటు ఉద్యోగం అంటే ఊడిపోయే అవకాశం ఉంది కానీ ప్రభుత్వ ఉద్యోగం ఎందుకు ఊడిపోతుంది. అయినా ప్రభుత్వ ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని అనాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? అంటే ఇదేమీ భారీ లేఆఫ్స్ లో భాగంగా చేసిన హెచ్చరికలు కాదు. కానీ దీనికొక కారణం ఉంది. ఉద్యోగాలు పోతాయంటూ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. విద్యుత్ శాఖలో పని చేసే ఉద్యోగులకు, కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని నోటీసులు జారీ చేసింది. ఎందుకు ప్రభుత్వం ఉద్యోగులకు హెచ్చరించింది?
తమ డిమాండ్ల సాధనకై నిరవధిక సమ్మెకు సిద్ధమైన తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులు సిద్ధమయ్యారు. ఏప్రిల్ 25 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని ఆర్టిజం ఉద్యోగులు తేల్చి చెప్పారు. ఆర్టిజన్ ఉద్యోగులు ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లను ఉంచారు. ఎక్సిస్టింగ్ సర్వీస్ రూల్ అమలు చేయాలని, కార్మికుల విద్యార్హతను బట్టి కన్వెర్షన్ ఇవ్వాలని, 50 శాతం పీఆర్సీ అమలు చేయాలని, కొత్తగా చేరిన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని.. దీనిపై హామీ ఇవ్వాలని కోరారు. లేదంటే నిరవధిక సమ్మెకు దిగుతామని ప్రకటించారు. అయితే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు షాకిచ్చింది. వారి ఉద్యోగాలకు లింక్ పెడుతూ.. సమ్మె కొనసాగిస్తే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామంటూ హెచ్చరించింది. ఈ మేరకు ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ విద్యుత్ సౌధ నోటీసులు జారీ చేసింది.
15.04.2023న మేనేజ్మెంట్స్ మరియు సంబంధిత ట్రేడ్ యూనియన్ల మధ్య జరిగిన సెటిల్మెంట్ మెమోరాండం ప్రకారం.. పవర్ యుటిలిటీస్ మేనేజ్మెంట్స్ యూనియన్లతో 19.04.2023వ తేదీన ఒప్పందం కుదుర్చుకుంది. సెక్షన్ 12(3) ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కింద ఒప్పందం జరిగింది. కావున సమ్మె కొనసాగించినా, ఎవరైనా ఉద్యోగులను సమ్మెకు ప్రేరేపించినా, ఉద్యోగులు గానీ ఆర్టిజన్ ఉద్యోగులు గానీ పైన తెలుపబడిన సెటిల్మెంట్ ను ఉల్లంఘిస్తే సమ్మెను చట్టవిరుద్ధమైన సమ్మెగా ట్రీట్ చేస్తామని హెచ్చరించింది. ప్రస్తుతం వేసవి కాలం కాబట్టి నిరంతర విద్యుత్ సరఫరాను అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతీ ఉద్యోగి కూడా బాధ్యతగా విధులను నిర్వహించాలని నోటీసుల్లో పేర్కొంది. ప్రభుత్వ నోటీసులకు విరుద్ధంగా సమ్మెకు దిగితే ఆరోజునే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని హెచ్చరికలు జారీ చేసింది. మరి ప్రభుత్వ హెచ్చరికలను ఉద్యోగులు పరిగణలోకి తీసుకుని వెనక్కి తగ్గుతారో? లేదో? చూడాలి.
జాబ్స్ పోతాయంటూ ఉద్యోగులను హెచ్చరించిన ప్రభుత్వం.. pic.twitter.com/Bdur2y0S4m
— Rajasekhar (@Rajasek61450452) April 23, 2023