ప్రభుత్వ విద్యాసంస్థల్లో చాలా వాటిల్లో మౌలిక వసతుల కొరతతో స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. అందుకు తాజా ఘటనే ఉదాహరణ. ఓ సర్కారు కళాశాలలో 700 మంది విద్యార్థినులకు ఒకే మూత్రశాల ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనపై ప్రజలు విశ్వాసాన్ని చూపించి రెండో పర్యాయం సీఎం గా ఎన్నుకున్నారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ది కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నారు సీఎం కేసీఆర్.
అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మరణించిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వీధిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న చిన్నారి ప్రదీప్ పై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి చంపేశాయి. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురైయ్యారు.
మహాశివరాత్రి సందర్భంగా దేశ వ్యాప్తంగా శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిట కిటలాడుతున్నాయి. శివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు భక్తులు ఎంతో నియమనిష్టతో ఉపవాసం ఉంటారు.. ఉదయం నుంచి సాయంత్రం వరకు పరమశివున్ని భక్తితో స్మరిస్తూ ఉంటారు.
భీమ్లా నాయక్‌లో ‘ఆడ కాదు.. ఈడా కాదు’ పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన ప్రతిభతో పద్మశ్రీ అవార్డును సైతం సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంలోనే తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయలు, ఇంటి పట్టా ఇస్తామని ప్రకటించింది.
తెలంగాణ గవర్నర్‌కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలాలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంటే ఫామ్ హౌస్‌లు కట్టడం కాదు అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు వేసింది గవర్నర్. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది. తమిళిసై తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ కావడం […]
హైకోర్టు తీర్పు కారణంగా సోమేష్ కుమార్ ఆంధ్రప్రదేశ్ క్యాడర్‌కు రిలీవింగ్ నేపథ్యంలో తెలంగాణ తదుపరి ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎవరనేది ఉత్కంఠగా మారింది. సీఎస్ నియామకం విషయంలో సీఎం కేసీఆర్ ఏం చేస్తారనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. రాష్ట్ర కొత్త సీఎస్ రేసులో ముగ్గురు అధికారుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర కేడర్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో వసుధా మిశ్రా, రాణి కుముదిని, శాంతి కుమారి, శశాంక్ గోయల్, సునీల్ శర్మ, రజత్ కుమార్, రామకృష్ణారావు, […]
హైదరాబాద్.. ఐటీ రంగంలో దూసుకెళ్తున్న మహానగరం. భారతదేశంలో ఇతర నగరాల కంటే ఎక్కువగా ఐటీ, స్టార్టప్ కంపెనీలకు వేదికగా నిలుస్తోంది హైదరాబాద్. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో కంపెనీలు తమతమ కంపెనీలను ప్రారంభించేందుకు అనువైన స్థలంగా హైదరాబాద్ ను పేర్కొంటున్నాయి. దాంతో ఇప్పటికే పదుల సంఖ్యలో ఐటీ కంపెనీలకు కేంద్రబిందువైంది భాగ్యనగరం. ఇక హైదరాబాద్ మణిహారంలో మరో ఐటీ హబ్ చేరబోతోంది. ఇందుకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం కూడా అయ్యాయి. త్వరలోనే మలక్ పేటలో 16 […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనర్ల పెళ్లిళ్లపై దృష్టి సారించింది. బాల్య వివాహాలు జరగటం ముఖ్యంగా అరబ్ షేక్‌లు కాంట్రాక్ట్ పద్దతిలో మైనర్లను పెళ్లి చేసుకుంటున్న ఘటనలు రాష్ట్రంలో పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మైనర్ల వివాహాలు జరగకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లింలు పెళ్లి చేయాలంటే ఆధార్ తప్పని సరి చేసింది. పెళ్లి సమయంలో వధూవరుల ఆధార్ కార్డులను తప్పనిసరిగా తీసుకోవాలని, వయస్సును ధ్రువీకరించాలని వక్ఫ్ బోర్డుకు ఆదేశాలు జారీ […]
రాష్ట్రంలోని నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం వరుస పెట్టి శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే 9,168 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం.. తాజాగా మరికొన్ని ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీల్లో 3,897 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద వివిధ కేటగిరీలలో ఉన్న 9 మెడికల్ కళాశాలలు, వాటి అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 3,897 […]