రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ నడుస్తోంది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో పదో తరగతి పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు..
రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల సీజన్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు నడుస్తున్నాయి. ఇక త్వరలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. తెలంగాణలో ఏప్రిల్ 3-10 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ సారి పరీక్షల నిర్వహణలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. మరీ ముఖ్యంగా గతంలో మాదిరి 11 పేపర్లు కాకుండా.. ఈ సారి కేవలం ఆరు పేపర్లకే కుదించారు. పేపర్లు మాత్రమే కుదిస్తున్నామని.. 100 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహిస్తామని.. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో పాటు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు విద్యాశాఖ అధికారులు. ఓ పేపర్‌కు సంబంధించి పరీక్ష సమయాన్ని బాగా కుదించారు. ఆ వివరాలు..
ఈ సారి పదో తరగతి పరీక్షల్లో భాగంగా మల్టీపుల్ చాయిస్ ప్రశ్నాపత్రం అనగా బిట్ పేపర్ రాసేందుకు కేవలం 15 నిమిషాల సమయం మాత్రమే ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. అది కూడా ఆఖరిలోనే బిట్ పేపర్ రాయాలని వెల్లడించారు. గతంలో బిట్ పేపర్‌కి 30 నిమిషాల సమయం ఇచ్చేవారు. దాన్ని కుదించడం.. విద్యార్థులకు కాస్త ఇబ్బందే అని చెప్పవచ్చు. అలానే జనరల్ సైన్స్ పరీక్షకు సంబంధించి.. రెండు ప్రశ్నాపత్రాలను ఒకేసారిగా కాకుండా.. నిర్దేశించిన సమయానికి.. విద్యార్థులకు విడి విడిగా ఇవ్వాలని నిర్ణయించారు అధికారులు. ఈ జనరల్ సైన్స్ పరీక్షలో 40 మార్కుల చొప్పున రెండు పేపర్లు ఉంటాయి.
వీటిలో ఒకటి ఫిజికల్ సైన్స్ పేపర్ కాగా.. మరొకటి బయాలాజికల్ సైన్స్ పేపర్. మొదటి పేపర్ ఇచ్చి.. దానికి 90 నిమిషాల సమయం కేటాయిస్తారు. ఆ సమయం పూర్తయిన తర్వాత.. 20 నిమిషాలు గ్యాప్ ఇచ్చి.. సెకండ్ పేపర్ ఇస్తారు. దానికి కూడా 90 నిమిషాలు సమయం ఇస్తారు. ఆ తర్వాత ఆఖర్లో మల్టీపుల్ చాయిస్ ప్రశ్నల పత్రాన్ని ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు ఆ 15 నిమిషాల్లోనే దానికి సమాధానాలు రాయాలని సూచించారు. 15 నిమిషాల్లోనే విద్యార్థులు 10 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. మరి ఇలా సమయం కుదించడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడతారని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.